అక్షరటుడే, వెబ్‌డెస్క్: Oct 07 Market Analysis | యూఎస్ (US) చమురు ఉత్పాదక ప్రాంతాలవైపు దూసుకువస్తున్న తుఫాను ప్రభావంతోపాటు సౌదీ అరేబియాపై యెమన్‌కు చెందిన ఇరాన్ మద్దతుగల హౌతీల దాడులతో ముడి చమురు ధరలు తిరిగి బ్యారెల్ కు వంద డాలర్లు దాటాయి. ఇది ఈక్విటీ మార్కెట్లపై ప్రభావం చూపుతోంది. అయితే మూడో త్రైమాసిక ఆదాయాల అంచనాలు పాజిటివ్ గా ఉండడంతో గత సెషన్లో వాల్‌స్ట్రీట్ (Wallstreet) లాభాలతో ముగిసింది.
క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తుండడంతో బుధవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు మాత్రం నెగెటివ్‌గా స్పందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు సైతం నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
Oct 07 Market Analysis | యూఎస్ మార్కెట్లు..
మూడో త్రైమాసిక ఆదాయాల అంచనాలు పాజిటివ్ గా ఉండడంతో వాల్ స్ట్రీట్ సరికొత్త గరిష్ట స్థాయిలకు చేరుకుంది. గత సెషన్లో నాస్డాక్ 0.45 శాతం, ఎస్ అండ్ పీ 0.58 శాతం పెరగ్గా.. బుధవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.05 శాతం నష్టంతో ఉంది.
Oct 07 Market Analysis | యూరోప్ మార్కెట్లు..
జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.77 శాతం, యూకేకు చెందిన ఎఫ్టీఎస్ఈ 0.42 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.39 శాతం పెరిగాయి.
Oct 07 Market Analysis | ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా Asia మార్కెట్లు లాభాలతో ఉన్నాయి. ఉదయం 7.30 గంటల ప్రాంతంలో తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.11 శాతం లాభంతో ఉండగా.. సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 1.06 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.78 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.72 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.60 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. చైనా మార్కెట్లకు సెలవు. గిఫ్ట్ నిఫ్టీ 0.28 శాతం నష్టంతో ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ డౌన్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
Also Read : Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..
Oct 07 Market Analysis | ఆర్బీఐ గవర్నర్ ప్రకటనపై ఫోకస్..
ఆర్బీఐ ఎంపీసీ మీటింగ్ తీర్మానాలను ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రకటించనున్నారు. వడ్డీ రేట్లను 0.25 బేసిస్ పాయింట్ల మేర పెంచవచ్చని మార్కెట్ అంచనా వేస్తోంది. ఇంతకన్నా ఎక్కువ పెంచితే నెగెటివ్‌గా స్పందించే అవకాశాలున్నాయి. ఆర్బీఐ గవర్నర్ చేసే కామెంట్తోనూ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశాలున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు వరుసగా ఎనిమిదో సెషన్లోనూ నికర అమ్మకందారులుగా ఉన్నారు. నికరంగా రూ. 2,961 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
- డీఐఐలు వరుసగా 39 వ సెషన్లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్లో నికరంగా రూ. 5,088 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 12 పైసలు బలహీనపడి 96.42 వద్ద ఉంది.
- క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 101.52 డాలర్ల వద్ద ఉంది.
- యూఎస్ డాలర్ ఇండెక్స్ 102.01 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 5.31 శాతం వద్ద ఉంది.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 0.94 నుంచి 1.06 కు పెరిగింది.
- విక్స్ 7.9 శాతం తగ్గి 13.6 వద్ద ఉంది.