అక్షరటుడే, కామారెడ్డి: Modi Political Journey | ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) పాతికేళ్ల రాజకీయ ప్రస్థానం దేశాభివృద్ధికి సువర్ణాధ్యాయమని మాజీ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం పట్టణంలో(Kamareddy) కార్యక్రమాలు నిర్వహించారు.
Modi Political Journey | జీపీఎన్ రోడ్ నుంచి..
కామారెడ్డి పట్టణంలోని జేపీఎన్ రోడ్ వద్ద ప్రధాని ప్రసంగాన్ని కార్యకర్తలు వీక్షించారు. అనంతరం సేవా జ్యోతి కలశ యాత్రను పట్టణ ప్రధాన వీధుల గుండా నిజాంసాగర్ చౌరస్తా వరకు నిర్వహించారు. బీబీ పాటిల్ మాట్లాడుతూ.. మోదీ 25 ఏళ్ల ప్రస్థానం గుజరాత్, భారతదేశ అభివృద్ధిలో సువర్ణ అధ్యాయమన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా పాలనా దక్షతను, ప్రధానిగా భారత్ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటారని కొనియాడారు. నిరంతరం ప్రజాసేవ, నవభారత నిర్మాణమే ఆయన లక్ష్యమని, వికసిత భారత్ దిశగా సాగుతున్న ప్రయాణానికి అందరం అండగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు, మున్సిపల్ కౌన్సిలర్లు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: హోం లోన్ తీసుకుంటే..జీవితాంతం ఈఎంఐ చెల్లించాలి