Amazon Job Cuts | అమెజాన్​లో 1000 ఉద్యోగాల కోత

అమెజాన్​ తాజాగా 1000 మంది ఉద్యోగులను తొలగించింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Amazon Job Cuts | ఏఐ ప్రభావంతో సాఫ్ట్​వేర్​ రంగంలో వేలాది మంది ఉద్యోగాలను కోల్పోతున్నారు. రాత్రికి రాత్రే పలు కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఒక మెయిల్​తో వారికి ఉద్వాసన పలుకుతున్నాయి. దీంతో టెకీలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా అమెజాన్​ (Amazon​) మరో 1000 మంది ఉద్యోగులను తొలగించింది.

కంపెనీ రిటైల్ వ్యాపారంలోని కొన్ని భాగాలతో సహా, అనేక బృందాలలో సిబ్బందిని తొలగించారు. భారత్​, అమెరికా, యూకేలోని ఉద్యోగులపై ఈ కోతలు ప్రభావం చూపుతాయి. ప్రపంచవ్యాప్తంగా 1,000 కంటే తక్కువ వైట్-కాలర్ ఉద్యోగులు ప్రభావితమైనట్లు సమాచారం. దీనిపై అమెజాన్​ స్పందిస్తూ.. కొంతమందిని మాత్రమే తొలగించామని తెలిపింది. ఇ-కామర్స్ కార్యకలాపాలను నిర్వహించే ‘స్టోర్స్’లలో ఉద్యోగులను తొలగించినట్లు పేర్కొంది.

Amazon Job Cuts | పలు విభాగాల్లో..

కస్టమర్ సర్వీస్, సెల్లింగ్ పార్టనర్ సర్వీసెస్, మార్కెట్‌ప్లేస్ సపోర్ట్‌కు సంబంధించిన బృందాలు ప్రభావితమయ్యాయి. అమెజాన్ రిటైల్ కార్యకలాపాలలో ఇంజనీరింగ్ ఉద్యోగాలు కూడా దెబ్బతిన్నాయి. ఖర్చులను తగ్గించుకోవడానికి అమెజాన్​ 2025 చివరి నుండి 2026 జనవరి మధ్య సుమారు 30,000 ఉద్యోగాలను తొలగించింది. తాజా తొలగింపులు తక్కువే అయినా.. ఇంకా కోతలు ఉంటాయని తెలుస్తోంది. దీంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

ఇది కూడా చదవండి..: CJP Protest Bengaluru | సీజేపీ ఆందోళన.. బెంగళూరులో టెన్షన్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *