OTT Releases This Weekend | ఓటీటీలోకి మండాడి, ఎపిక్.. ఈ వీకెండ్‌లో స్ట్రీమింగ్ అయ్యే క్రేజీ సినిమాలివే..

వీకెండ్​లో మూవీ లవర్స్​ను అలరించేందుకు ప్రముఖ ఓటీటీలు రెడీ అయ్యాయి.

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్​: OTT Releases This Weekend | వీకెండ్​లో మూవీ లవర్స్​ను అలరించేందుకు ప్రముఖ ఓటీటీలు రెడీ అయ్యాయి. వారమంతా తీరికలేని పనులతో బిజీగా గడిపి వీకెండ్​ మూవీస్​ చూస్తూ ఎంజాయ్​ చేయాలనుకునే వారికి నయా కంటెంట్​తో సిద్ధంగా ఉన్నాయి. నెట్​ఫ్లిక్స్​, అమెజాన్​ ప్రైమ్​, జియో హాట్​స్టార్​ (Jio Hotstar)లలో లేటెస్​ మూవీస్​తో పాటు పలు సిరీస్​లు​ స్ట్రీమింగ్​ అవుతున్నాయి. అవేంటో తెలుసుకుందాం..

OTT Releases This Weekend | ఈ వీక్​ స్పెషల్​ ఇవే..

సూరి-సుహాస్ యాక్ట్​ చేసిన రా అండ్ రస్టిక్ యాక్షన్ మూవీ ‘మండాడి’ నెట్​ ఫ్లిక్స్​లో స్ట్రీమింగ్​ అవుతోంది. ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రత్యేక ఆకర్షణ ఈ మూవీనే. ఈ చిత్రం తెలుగు, తమిళ సహా పలు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య నటించిన యూత్‌ఫుల్ కాలేజ్ లవ్ డ్రామా ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. ఈ సినిమా కూడా తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. వీటితో పాటు మరిన్ని సినిమాలు సిరీస్​లు కూడా స్ట్రీమ్​ అవుతున్నాయి.

OTT Releases This Weekend | అమెజాన్​ ప్రైమ్​లో..

ఇక అమెజాన్​ ప్రైమ్​లో విభిన్న జోనర్ల చిత్రాలు అందుబాటులో ఉన్నాయి. కార్తీ యాక్ట్​ చేసిన పవర్‌ప్యాక్డ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్ 2’ స్ట్రీమింగ్‌కి వచ్చి డిజిటల్ వ్యూయర్స్‌ను ఆకట్టుకుంటోంది. యాక్షన్ అంశాలతో రూపొందిన ‘ఖలీఫా (ది రూలర్)’ శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చింది.

OTT Releases This Weekend | జియో హాట్​స్టార్​లో..

భారీ యాక్షన్ హాలీవుడ్ చిత్రం ‘మోర్టల్ కొంబట్ II’ జియో హాట్​స్టార్​లోకి వచ్చేందుకు తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో స్ట్రీమింగ్‌ అవుతోంది. అలాగే ‘షెరిఫ్ కంట్రీ సీజన్ 2’, ‘ట్రెజర్ ఐలాండ్’ ఇంగ్లీష్ సిరీస్‌లు సిద్ధమయ్యాయి. ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్ ‘పతి పత్నీ ఔర్ పంగా సీజన్ 2’ హిందీ సిరీస్‌లు ఈ వీకెండ్ లిస్ట్‌లో చేరాయి.

OTT Releases This Weekend | ఈటీవీ విన్‌లో..

వైవా హర్ష ప్రధాన పాత్రలో యాక్ట్​ చేసిన కామెడీ వెబ్ సిరీస్ ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ స్ట్రీమింగ్​ అవుతోంది. ఈ సిరీస్​ ప్రేక్షకుల్లో నవ్వులు పూయిస్తోంది. క్రైమ్, థ్రిల్లర్, రొమాన్స్, కామెడీ నుంచి భారీ యాక్షన్ వరకు అన్ని జోనర్లతో ఈ వీకెండ్‌ సినిమా ప్రియులకు నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ లభించనుంది.

ఇది కూడా చదవండి..: Home Loan Tips | హోమ్​​లోన్​ తీసుకుంటున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *