అక్షరటుడే, వెబ్‌డెస్క్: OTT Releases This Weekend | వీకెండ్లో మూవీ లవర్స్‌ను అలరించేందుకు ప్రముఖ ఓటీటీలు రెడీ అయ్యాయి. వారమంతా తీరికలేని పనులతో బిజీగా గడిపి వీకెండ్ మూవీస్ చూస్తూ ఎంజాయ్ చేయాలనుకునే వారికి నయా కంటెంట్‌తో సిద్ధంగా ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్ (Jio Hotstar)లలో లేటెస్ మూవీస్‌తో పాటు పలు సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. అవేంటో తెలుసుకుందాం..
OTT Releases This Weekend | ఈ వీక్ స్పెషల్ ఇవే..
సూరి-సుహాస్ యాక్ట్ చేసిన రా అండ్ రస్టిక్ యాక్షన్ మూవీ ‘మండాడి’ నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రత్యేక ఆకర్షణ ఈ మూవీనే. ఈ చిత్రం తెలుగు, తమిళ సహా పలు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య నటించిన యూత్‌ఫుల్ కాలేజ్ లవ్ డ్రామా ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. ఈ సినిమా కూడా తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్కు వచ్చింది. వీటితో పాటు మరిన్ని సినిమాలు సిరీస్‌లు కూడా స్ట్రీమ్ అవుతున్నాయి.
OTT Releases This Weekend | అమెజాన్ ప్రైమ్‌లో..
ఇక అమెజాన్ ప్రైమ్‌లో విభిన్న జోనర్ల చిత్రాలు అందుబాటులో ఉన్నాయి. కార్తీ యాక్ట్ చేసిన పవర్‌ప్యాక్డ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్ 2’ స్ట్రీమింగ్కి వచ్చి డిజిటల్ వ్యూయర్స్‌ను ఆకట్టుకుంటోంది. యాక్షన్ అంశాలతో రూపొందిన ‘ఖలీఫా (ది రూలర్)’ శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చింది.
OTT Releases This Weekend | జియో హాట్‌స్టార్‌లో..
భారీ యాక్షన్ హాలీవుడ్ చిత్రం ‘మోర్టల్ కొంబట్ II’ జియో హాట్స్టార్లోకి వచ్చేందుకు తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే ‘షెరిఫ్ కంట్రీ సీజన్ 2’, ‘ట్రెజర్ ఐలాండ్’ ఇంగ్లీష్ సిరీస్‌లు సిద్ధమయ్యాయి. ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ ‘పతి పత్నీ ఔర్ పంగా సీజన్ 2’ హిందీ సిరీస్‌లు ఈ వీకెండ్ లిస్ట్‌లో చేరాయి.
OTT Releases This Weekend | ఈటీవీ విన్లో..
వైవా హర్ష ప్రధాన పాత్రలో యాక్ట్ చేసిన కామెడీ వెబ్ సిరీస్ ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ ప్రేక్షకుల్లో నవ్వులు పూయిస్తోంది. క్రైమ్, థ్రిల్లర్, రొమాన్స్, కామెడీ నుంచి భారీ యాక్షన్ వరకు అన్ని జోనర్లతో ఈ వీకెండ్ సినిమా ప్రియులకు నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్ లభించనుంది.
ఇది కూడా చదవండి..: Home Loan Tips | హోమ్‌లోన్ తీసుకుంటున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి