CJP Protest | సీజేపీ ఆందోళన.. ఢిల్లీలో హై టెన్షన్​

కాక్రోచ్​ జనతా పార్టీ నిరసనకు పిలుపునివ్వడంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తం అయ్యారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CJP Protest | ఢిల్లీ (Delhi)లో నిరసనలకు నేడు కాక్రోచ్​ జనతా పార్టీ పిలుపునివ్వడంతో హై టెన్షన్​ నెలకొంది. ప్రధాన ఎన్నికల కమిషనర్​ (CEC) జ్ఞానేశ్​ కుమార్​ రాజీనామా చేయాలని సీజేపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టనున్నారు. ఈ క్రమంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు.

సీజేపీ నిరసన నేపథ్యంలో మోహన్ ఎస్టేట్ ప్రాంతం చుట్టూ పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. స్పైక్ స్ట్రిప్స్‌ను కూడా అమర్చారు. 20 వేల మందికి పైగా సిబ్బందిని మోహరించారు. ఈ నిరసనకు పోలీసులు ఇంకా అనుమతి ఇవ్వలేదు. అంతేగాకుంగా నగరంలో 400 మందిని అదుపులోకి తీసుకున్నారు.

CJP Protest | మెట్రో స్టేషన్లు మూసివేత

సీజేపీ నిరసన నేపథ్యంలో పలు మెట్రో స్టేషన్​లను పోలీసులు మూసి వేశారు. రాజీవ్ చౌక్, న్యూఢిల్లీ, సెంట్రల్ సెక్రటేరియట్, పటేల్ చౌక్, కాశ్మీర్ గేట్‌తో సహా 45 మెట్రో స్టేషన్ల వద్ద ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు మూసి వేసినట్లు తెలిపారు. శనివారం ఉదయం 4 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల మధ్య న్యూఢిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్లకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే 250కి పైగా రైళ్లు, స్థానిక రైళ్లను రద్దు చేశారు. శుక్రవారం రాత్రి నుంచి జనపథ్-కర్తవ్య పథ్ కూడలికి 4 కిలోమీటర్ల పరిధిలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.

దీనిని కూడా చదవండి : Rajouri Road Accident | ఘోర ప్రమాదం.. లోయలో పడిన వాహనం.. ఇద్దరి దుర్మరణం!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *