అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad Police | హైదరాబాద్ నగరంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటనలో చోటు చేసుకుంది.
దబీర్‌పురాకు చెందిన తాహెరా భాను (36) ‘మన్హా హోల్‌సేల్ స్టోర్’లో పని చేసేది. అజాంపూర్‌లోని సైఫా మసీదు సమీపంలో తనకు తెలిసిన ఓ వ్యక్తి ఆమెను అడ్డుకున్నాడు. అనంతరం ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో నిందితుడు భానుపై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే చనిపోయిందని వైద్యులు తెలిపారు.
Hyderabad Police | కేసు నమోదు
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, వివరాలు సేకరించారు. తాహెరాను హత్య చేసింది ఆమెకు తెలిసిన వ్యక్తే అని పోలీసుల అనుమానిస్తున్నారు. వారి ఇద్దరి మధ్య గొడవ జరగడానికి, హత్య దారి తీసిన పర్థిస్థితులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
దీనిని కూడా చదవండి : Telangana Drought Situation | తెలంగాణలో వర్షాభావంపై సీఎం రేవంత్ రెడ్డి నజర్.. ఈనెల 12న మంత్రులతో ప్రత్యేక భేటీ