Shashi Tharoor | ఢిల్లీలో ఆంక్షలపై శశిథరూర్​ ఆగ్రహం

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Shashi Tharoor | సీజేపీ ఆందోళన నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ ఆంక్షలపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం ప్రశ్నలను స్వాగతించాలని, రాజధానిని ఒక దుర్గంలా మార్చడం అనుమానాలను మరింత పెంచుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వం లాఠీలు కాదు, సమాధానాలు ఇవ్వాలన్నారు. ఎన్నికల సంఘం (Election Commission)పై విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి బారికేడ్లు ఏమీ చేయలేవు, ప్రజల ప్రశ్నలకు ఎంత త్వరగా సమాధానమిస్తే అంత త్వరగా శాంతి నెలకొంటుందని శశిథరూర్​ అన్నారు.

Shashi Tharoor | తిరోగమన చర్య..

ఢిల్లీలో వందల మీటర్లకు చెక్‌పోస్టులు, రోడ్లకు అడ్డంగా కాంక్రీట్ బారికేడ్లు, స్పైక్ స్ట్రిప్‌లు వేయడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధ రీతిలో బలగాలను మోహరించారని విమర్శించారు. ఈ ఆంక్షలను ఆయన తిరోగమన చర్యలుగా అభివర్ణించారు. దేశ రాజధానిలో స్వేచ్ఛగా సంచరించే హక్కు కాలరాస్తున్నారన్నారు. ఢిల్లీలో ప్రజలు నిరసన తెలపడానికి జంతర్ మంతర్‌ను ఏర్పాటు చేశారని చెప్పారు. కానీ నేడు దానికి వెళ్లే అన్ని మార్గాలను మూసి వేశారన్నారు. మహిళలకు నగరాలను మరింత సురక్షితంగా మార్చడానికి ఇలాంటి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి..: Madras High Court | మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *