TTD Karnataka Choultry | తిరుమల స్వామివారి సొత్తుపై కన్నువేస్తే ఊరుకోం : కర్ణాటక సీఎం డి.కె. శివకుమార్‌కు టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి తీవ్ర హెచ్చరిక

ఈ భూమిని కర్ణాటక టూరిజం డిపార్ట్‌మెంట్‌కు కట్టబెడుతూ క్యాబినెట్ నోట్ తీసుకురావడం దారుణం. ఈ నిర్ణయాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కర్ణాటక సర్కారు వెంటనే ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలి.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: TTD Karnataka Choultry | తిరుమల పుణ్యక్షేత్రం పూర్తిగా వెంకటేశ్వర స్వామివారి దివ్య సొత్తు అని, అందులోని ప్రతి రాయి, రప్ప, పుట్ట, చెట్టు సమస్తం స్వామివారికే అంకితమని టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. తిరుమలలోని కర్ణాటక సత్రాలకు చెందిన 7.5 ఎకరాల స్థలాన్ని కర్ణాటక టూరిజం కార్పొరేషన్‌కు బదిలీ చేస్తూ కర్ణాటక మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

TTD Karnataka Choultry | “కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం దారుణం”

ఈ సందర్భంగా భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ – “మైసూరు మహారాజుల కాలంలో యాత్రికుల సౌకర్యార్థం కేటాయించిన స్థలంలో కర్ణాటక ప్రభుత్వం గదులు నిర్మించింది. అయితే, నిబంధనలను అతిక్రమించి, సబ్-లీజుకు ఇచ్చే అవకాశం లేకపోయినా, ఈ భూమిని కర్ణాటక Karnataka టూరిజం డిపార్ట్‌మెంట్‌కు కట్టబెడుతూ క్యాబినెట్ నోట్ తీసుకురావడం దారుణం. ఈ నిర్ణయాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కర్ణాటక సర్కారు Govt వెంటనే ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలి” అని డిమాండ్ చేశారు.

TTD Karnataka Choultry | “రాజకీయ, వ్యాపార ప్రయోజనాల కోసమే ఈ కుట్ర”

కర్ణాటక ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్‌పై భానుప్రకాష్​ రెడ్డి నిప్పులు చెరిగారు. “డి.కె. శివకుమార్ తన ముఖ్యమంత్రి హోదాను, పరపతిని ఉపయోగిస్తూ కొందరికి లబ్ధి చేకూర్చేందుకు ఈ కుట్రకు తెరతీశారు. కాంగ్రెస్ నాయకులు, మాజీ కేంద్ర మంత్రులు ఇందులో చక్రం తిప్పుతూ అక్కడ షాపులు, హోటళ్లను దక్కించుకోవాలని చూస్తున్నారు. ధార్మిక క్షేత్రమైన తిరుమలను వ్యాపార కేంద్రంగా, రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చాలని ప్రయత్నిస్తే.. చూస్తూ ఊరుకోం. వారి ఆటలను మేము సాగనివ్వం” అని హెచ్చరించారు.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

TTD Karnataka Choultry | “చట్టపరమైన చర్యలకు సిద్ధం”

“తిరుమలలోని ఒక ఇంచ్ స్థలాన్ని కూడా ఇతరులకు వదులుకునే ప్రసక్తి లేదు. టీటీడీ యాక్ట్ 30/1987 ప్రకారం అక్కడ ఉన్న ఆస్తులన్నీ స్వామివారికి సంబంధించినవే. ఈ విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులతో చర్చించి, కర్ణాటక ప్రభుత్వానికి తక్షణమే లీగల్ నోటీసులు పంపుతాం. డి.కె. శివకుమార్ తన ధోరణి మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో జరిగే తీవ్ర పరిణామాలకు కర్ణాటక ప్రభుత్వమే బాధ్యత వహించాలి..” అని భానుప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *