Nepal Floods | నేపాల్‌లో మరోసారి వరదలు

నేపాల్​లో మరోసారి వరదలు బీభత్సం సృష్టించాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal Floods | నేపాల్​లో మరోసారి వరదలు బీభత్సం సృష్టించాయి. మెరుపు వరదలతో గోర్ఖాలోని సల్లెరి బజార్ కొట్టుకుపోయింది. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి.

భారీ వరదలతో అనేక ఇళ్లు కొట్టుకుపోయాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. నది పరివాహక ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కోరారు. ఖాట్మండుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోర్ఖా జిల్లాలోని చుమ్నుబ్రి గ్రామంలో కొండచరియలు విరిగిపడటంతో బుధి గండకి నదికి అడ్డుకట్ట పడింది. దీంతో దిగువ ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. ఆగస్టులో నేపాల్​లో వచ్చిన వరదలతో 1,457 మంది మరణించగా, వేలాది మంది ఇప్పటికీ గల్లంతయ్యారు.

Nepal Floods | కొట్టుకుపోయిన వంతెనలు

తాజాగా వరదలతో రెండు సస్పెన్షన్ వంతెనలు కొట్టుకుపోయాయి. ఒక జలవిద్యుత్ ప్రాజెక్ట్ దెబ్బతిందని అధికారులు తెలిపారు. గోర్ఖా, తనాహున్, చిత్వాన్, తూర్పు నవల్పరాసి, పశ్చిమ నవల్పరాసి జిల్లాల్లోని నదీ తీర ప్రాంత ప్రజలను జాతీయ అధికారులు అప్రమత్తం చేశారు. సైన్యం, పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

దీనిని కూడా చదవండి : Koukour Girl Murder | సికింద్రాబాద్‌లో దారుణం.. ఆరేళ్ల బాలిక హత్య!

 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *