May 01 Horoscope | పెళ్లి పీటలెక్కనున్న ప్రేమ బంధం.. ఆ రాశుల వారి ఇంట్లో పెళ్లి బాజాలే!

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 01 Horoscope | గ్రహ బలాలు ఎలా ఉండబోతున్నాయి? ఈరోజు (శుక్రవారం, మే 01) ఏయే పనులు కలిసొస్తాయి.. ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో రాశి ఫలితాల్లో తెలుసుకుందాం.

May 01 Horoscope | రాశుల వారీగా..

మేష రాశి: ఇవాళ ధన లాభం కలుగుతుంది. చాలా కాలంగా అనుకుంటున్న పొదుపు ప్లాన్‌లు అమల్లోకి వస్తాయి. ఖాళీ సమయాన్ని పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడానికి ఉపయోగిస్తారు. మీ నిజాయితీకి, కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. తప్పుడు వార్తలు లేదా నెగిటివ్ మెసేజ్‌ల వల్ల మూడ్ పాడయ్యే అవకాశం ఉంది.

May 01 Horoscope | వృషభం, మిథునం..

వృషభ రాశి: స్నేహితులు ఎవరైనా పెద్ద మొత్తంలో అప్పు అడిగితే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. వారికి సహాయం చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. పెండింగ్‌లో ఉన్న ఇంటి పనులను పూర్తి చేయడానికి ఇది చాలా మంచి రోజు. ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ప్రేమ బంధం పెళ్లి పీటల వరకు వెళ్లే సూచనలు ఉన్నాయి. కొత్త భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవడానికి లేదా కొత్త పనులు మొదలుపెట్టడానికి ఇవాళ అనుకూలం ఉంది.

మిథున రాశి: తల్లిదండ్రుల ఆరోగ్యం కోసం ఖర్చులు చేయాల్సి రావచ్చు. సన్నిహితుల నుంచి మీకు మంచి మద్దతు లభిస్తుంది. సమస్యలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి, విజయం మీదే అవుతుంది. ఇవాళ ఒక పెద్దమనిషి లేదా ఆధ్యాత్మిక గురువు ఇచ్చే సలహాలు సరైన దారిని చూపిస్తాయి.

May 01 Horoscope | కర్కాటకం, సింహం..

కర్కాటక రాశి: ఇవాళ కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ, తెలివితేటలతో ఆ నష్టాల నుంచి బయటపడి లాభాలను పొందుతారు. కుటుంబంలోకి కొత్త వ్యక్తి రాకవల్ల (వివాహం లేదా శిశు జననం వంటివి) ఇంట్లో పండగ వాతావరణం నెలకొంటుంది. ఆఫీసులో మీ పనితీరు, పట్టుదల అందరి ప్రశంసలు పొందుతాయి. మీ ఆలోచనలను సూటిగా, స్పష్టంగా చెప్పండి.

సింహ రాశి: అనవసరమైన గొడవలకు దూరంగా ఉండండి. కోపం లేదా ఆవేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల తర్వాత బాధపడాల్సి వస్తుంది. రోజంతా కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ, రోజు చివరికల్లా ఊహించని విధంగా లాభాలను పొందుతారు. వ్యక్తిగత విషయాల్లో స్నేహితులు అతిగా జోక్యం చేసుకునే అవకాశం ఉంది. ఆఫీసులో సహోద్యోగులు మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంటారు. మీ పనిలో వారు పూర్తి సహకారం అందిస్తారు.

May 01 Horoscope | కన్యా, తులా..

కన్యా రాశి: త్వరగా డబ్బు సంపాదించాలనే ఆలోచన బలంగా ఉంటుంది. అయితే తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఆఫీసులో మీకు చాలా బాగుంటుంది. మీరు సేకరించిన సమాచారం లేదా మీకున్న నాలెడ్జ్ పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. గత కొంతకాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఇవాళ ఎంతో ఉపశమనం లభిస్తుంది. ఈరోజును చాలా ఆనందంగా గడుపుతారు.

తులా రాశి: ఇవాళ చాలా ఉత్సాహంగా, సంతోషంగా ఉంటారు. పొదుపు చేయాలనే ప్లాన్ ఫలిస్తుంది. కొంత డబ్బును ఆదా చేయగలుగుతారు. ఆఫీసులో ఇవాళ ఒక సర్ప్రైజ్ లేదా ఒక మంచి వార్త అందే అవకాశం ఉంది. అది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. జీవిత భాగస్వామితో గొడవలు రావచ్చు.

May 01 Horoscope | మిగతా రాశులు..

వృశ్చిక రాశి: శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కోసం యోగా, ధ్యానం చేయడం మంచిది. ఆదాయం మెరుగుపడుతుంది, కానీ అదే సమయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి. ఇవాళ నేర్చుకునే కొత్త విషయాలు ఆఫీసులో మీ స్థాయిని పెంచుతాయి. సహోద్యోగులతో కలిసి పనిచేసేటప్పుడు మీ నాలెడ్జ్ బాగా ఉపయోగపడుతుంది.

ధనుస్సు రాశి: భవిష్యత్తు అవసరాల కోసం చేసే పెట్టుబడులు దీర్ఘకాలంలో మంచి లాభాలను ఇస్తాయి. చాలా కాలంగా చేయాలని ఎదురుచూస్తున్న ఒక ముఖ్యమైన పనిని ప్రారంభించడానికి లేదా పూర్తి చేయడానికి ఇవాళ అద్భుతమైన అవకాశం లభిస్తుంది.

మకర రాశి: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ధన లాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఏదైనా అవసరం పడితే సోదరుడు అండగా నిలుస్తారు. ఊహించిన దానికంటే ఎక్కువ మద్దతు లభిస్తుంది. ఇవాళ పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. అయితే, అనుకున్న ఫలితాలు వెంటనే రాకపోయినా నిరాశ చెందకుండా ప్రయత్నం కొనసాగించండి.

కుంభ రాశి: అనవసరపు ఖర్చులు తగ్గించుకుంటేనే భవిష్యత్తులో డబ్బు ఉపయోగపడుతుందని ఇవాళ అర్థమవుతుంది. దూరపు బంధువుల నుంచి ఒక మంచి వార్త అందుతుంది. ఇది కుటుంబం మొత్తంలో సంతోషాన్ని నింపుతుంది. పెళ్లి ప్రయత్నాలు చేసే వారికి అనుకూలమైన రోజు. ఏదైనా సాధించగల సామర్థ్యం ఉంది. ఇవాళ వచ్చే అవకాశాలను వదులుకోకుండా ఉపయోగించుకుని ముందుకు సాగండి.

మీన రాశి: మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, దీనివల్ల చేసే పనుల్లో పురోగతి కనిపిస్తుంది. డబ్బు కొరత వల్ల ఇంట్లో చిన్నపాటి మనస్పర్థలు రావచ్చు. ప్రేమ వ్యవహారాల్లో అనుకున్నంత సానుకూలత ఉండకపోవచ్చు. ఆఫీసులో మీ పని తీరు, ఆలోచనలు అందరినీ ఆకట్టుకుంటాయి. మీ పని తీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది.

Mother Son SSC Success | ఒకేసారి పదో తరగతి పరీక్షల్లో పాస్ అయిన తల్లి, కొడుకు

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *