అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bollaram Murder Case | సికింద్రాబాద్ (Secunderabad)లోని బొల్లారంలో చిన్నారి కిడ్నాప్, హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తనను ఉద్యోగం నుంచి తొలగించారనే కక్షతోనే సెక్యూరిటీ గార్డు విక్రమ్ పాపను కిడ్నాప్ చేశాడు.
సెక్యూరిటీ గార్డ్ విక్రమ్ ప్రవర్తన సరిగా లేకపోవడంతో వారం క్రితం అతడిని విల్లా అసోసియేషన్ ఉద్యోగంలో నుంచి తీసేసింది. దీంతో కక్ష పెంచుకున్న అతడు చిన్నారి అరేలియాను కిడ్నాప్ చేయాలని ప్లాన్ వేశాడు. ఈ మేరకు మరో సెక్యూరిటీ గార్డు, ఎలక్ట్రీషియన్ సహకారంతో బాలికను అపహరించాడు. అనంతరం వారి తల్లిదండ్రుల నుంచి డబ్బులు డిమాండ్ చేయాలని పథకం వేశాడు. ఈ మేరకు వారికి ఫోన్ చేసి డబ్బులు అడిగాడు.
Bollaram Murder Case | బతుకమ్మ వేడుకలు ఉండటంతో..
పాప కిడ్నాప్ సమయంలో విల్లా కమ్యూనిటీలో బతుకమ్మ వేడుకలు (Bathukamma Celebrations) నిర్వహించారు. ఆ సమయంలో పాపను కిడ్నాప్ చేశారు. చిన్నారి అరుపులు వినపడకుండా ఎలక్ట్రీషియన్ స్పీకర్ సౌండ్ ఎక్కువగా పెట్టాడు. కిడ్నాప్ అనంతరం చిన్నారిని విక్రమ్ బయటకు తీసుకు వెళ్లలేకపోయాడు. పోలీసులు వస్తారని చిన్నారిని హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారు అయ్యాడు. నిందితుడికి సహకరించిన మరో సెక్యూరిటీ గార్డు, ఎలక్ట్రిషియన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విక్రమ్ కోసం గాలిస్తున్నారు.
దీనిని కూడా చదవండి : Tahsildar Suspended | రైతును అవమానించిన గజ్వేల్ తహశీల్దార్‌పై వేటు