Sennheiser Amazon Sale | సెంహైజర్ ఆడియో డివైజైస్‌పై భారీ ఆఫర్లు.. ఏకంగా 60% వరకు డిస్కౌంట్!

Shivam nagarani

అక్గ్లోష్ల్రటుడే వెబ్‌డెస్క్:  ఆడియో దిగ్గజం ‘సెంహైజర్’ (Sennheiser) సంగీత ప్రియులు, కంటెంట్ క్రియేటర్లకు అదిరిపోయే తీపి కబురు అందించింది. రాబోయే అమెజాన్   సేల్ సందర్భంగా తన ప్రీమియం ఆడియో ప్రొడక్టులపై ఏకంగా 60% వరకు డిస్కౌంట్లు ప్రకటించింది. వీటితో పాటు 24 నెలల వరకు నో-కాస్ట్ ఈఎమ్‌ఐ వెసులుబాటును, ఎక్స్‌క్లూజివ్ బ్యాంక్ ఆఫర్లను కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది.

Sennheiser Amazon Sale |  ట్రూ వైర్‌లెస్ 4 ఇయర్‌బడ్స్..

మొమెంటమ్ 4: 42mm ఆడియోఫైల్-ఇన్స్పైర్డ్ ట్రాన్స్‌డ్యూసర్ సిస్టమ్, అడాప్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, ట్రాన్స్‌పరెన్సీ మోడ్ దీని ప్రత్యేకత. స్మార్ట్ కంట్రోల్ యాప్ ద్వారా సౌండ్ పర్సనలైజేషన్ చేసుకోవచ్చు. 4 డిజిటల్ బీమ్‌ఫార్మింగ్ మైక్‌లతో క్రిస్టల్ క్లియర్ కాల్స్, 60 గంటల సుదీర్ఘ బ్యాటరీ లైఫ్ లభిస్తాయి. అసలు ధరరూ.  34,990 కాగా.. బ్యాంక్ డిస్కౌంట్‌తో కలిపి ప్రత్యేకంగా రూ.  17,990 కే లభిస్తోంది.

మొమెంటమ్ ట్రూ వైర్‌లెస్ 4: ట్రూ రెస్పాన్స్ ట్రాన్స్‌డ్యూసర్ సిస్టమ్‌తో కూడిన ఈ ఇయర్‌బడ్స్ 24-bit/96kHz హై-ఫిడెలిటీ సౌండ్, అడాప్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అందిస్తాయి. 6 మైక్‌ల సెటప్, క్యూఐ వైర్‌లెస్ ఛార్జింగ్, 30 గంటల ప్లేటైమ్‌తో వస్తుంది. అసలు ధరరూ. 29,990 కాగా సేల్‌లో రూ. 14,990 కి సొంతం చేసుకోవచ్చు.

Sennheiser Amazon Sale | ప్రొఫైల్ యూఎస్‌బీ మైక్రోఫోన్ ..

ప్రొఫైల్ యూఎస్‌బీ మైక్రోఫోన్ ( Microphone ) : పొడ్కాస్టర్లు, స్ట్రీమర్స్, వాయిస్‌ఓవర్ ఆర్టిస్టుల కోసం రూపొందించిన ప్రీమియం యూఎస్‌బీ-సి కండెన్సర్ మైక్ ఇది. కార్డియోయిడ్ క్యాప్సూల్ బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ను తగ్గిస్తుంది. గెయిన్, మిక్స్, వాల్యూమ్ కంట్రోల్స్, మ్యూట్ బటన్ ఉంటాయి. ఇది మేక్, విండోస్, ఐప్యాడ్, ఆండ్రాయిడ్ డివైజెస్‌లో ప్లగ్-అండ్-ప్లేగా పనిచేస్తుంది. MRP రూ.  12,900 కాగా 46% డిస్కౌంట్‌తో రూ. 6,990 కే లభిస్తోంది.

ప్రొఫైల్ స్ట్రీమింగ్ సెట్: ఈ కంప్లీట్ సెట్ MRP రూ. 19,900 కాగా, 40% తగ్గింపుతో రూ.  11,990 కే అందుబాటులో ఉంది.

Sennheiser Amazon Sale | హెచ్‌డీ 490 ప్రో ..

ఖచ్చితమైన ఆడియో ప్రొడక్షన్ కోసం ఓపెన్-బ్యాక్ డిజైన్‌తో రూపొందించిన హెడ్‌ఫోన్స్ ఇవి. అన్‌కలర్డ్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్, లో-ఫ్రీక్వెన్సీ సిలిండర్ సిస్టమ్, రెండు రకాల ఇయర్-పాడ్ సెట్స్ దీని ప్రత్యేకత. స్టూడియో సెషన్స్‌లో సుదీర్ఘకాలం సౌకర్యంగా ఉండేలా డిజైన్ చేశారు. హెచ్‌డీ 490 ప్రో (MRP రూ. 40,000) 39% డిస్కౌంట్‌తో రూ. 24,490 కే లభిస్తోంది. అలాగే అదనపు యాక్సెసరీస్‌తో వచ్చే ‘ప్రో ప్లస్’ వేరియంట్ (MRP రూ.  45,000) 38% తగ్గింపుతో రూ. 27,990 కి లభిస్తుంది.

Sennheiser Amazon Sale | ఎంకేఈ 600 మైక్రోఫోన్..

హెచ్‌డీబీ 630: ఆడియోఫైల్స్ కోసం క్లోజ్డ్-బ్యాక్ డిజైన్, 42mm ట్యూన్డ్ ట్రాన్స్‌డ్యూసర్‌తో వస్తుంది. aptX హెచ్‌డీ, aptX అడాప్టివ్ సపోర్ట్‌తో పాటు బిటిడి 700 బ్లూటూత్ డోంగిల్ లభిస్తుంది. అడాప్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, 60 గంటల బ్యాటరీ లైఫ్‌తో కూడిన ఈ హెడ్‌ఫోన్ ఆఫర్ ధర రూ. 36,490 గా ఉంది.

ఎంకేఈ 600: వీడియో షూట్స్, ఫిలిం మేకింగ్ కోసం ఉపయోగపడే హైలీ డైరెక్షనల్ షాట్‌గన్ మైక్రోఫోన్ ఇది. సైడ్స్, రేర్ నుంచి వచ్చే నాయిస్‌ను ఎఫెక్టివ్‌గా తగ్గిస్తుంది. లో-కట్ ఫిల్టర్, ఆల్-మెటల్ హౌసింగ్‌తో లభిస్తుంది. MRP రూ.  31,900 కాగా 31% డిస్కౌంట్‌తో రూ. 21,990 కే వినియోగదారులకు అందుబాటులో ఉంది.

ఇది కూడా చదవండి: NTR Dragon Movie | సెట్స్‌లోకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ రీ-ఎంట్రీ.. రామోజీ ఫిల్మ్ సిటీలో ‘డ్రాగన్’ కొత్త షెడ్యూల్ షురూ

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *