Cockroach Janata Party Protest | మేము మళ్లీ వీధుల్లోకి వస్తాం.. అభిజిత్ దీప్కే సంచలన ప్రకటన

కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేతలు మరోసారి ఆందోళనలకు సిద్ధమవుతున్నారు.

Shivam nagarani

అక్షరటుడే  వెబ్‌డె‌స్క్: Cockroach Janata Party Protest | కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేతలు మరోసారి ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. ఇటీవల ఢిల్లీలో  ( Delhi ) జరిగిన నిరసన కార్యక్రమం సందర్భంగా పోలీసులు సీజేపీ కన్వీనర్ అభిజిత్ దీప్కేతో పాటు కోకన్వీనర్లు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లను అదుపులోకి తీసుకున్నారు.

Cockroach Janata Party Protest | కోర్టు బెయిల్ ..

అరెస్ట్ చేసిన నేతలను ఢిల్లీలోని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా, కోర్టు వారికి రూ. 50,000 పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. అయితే రానున్న ఏడాది పాటు శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించకూడదనే నిబంధనతో ఈ బెయిల్ ఇచ్చినట్లు పార్టీ లీగల్ హెడ్ రత్నా సింగ్ వెల్లడించారు.

Cockroach Janata Party Protest | అభిజిత్ దీప్కే స్పందన..

కోర్టు షరతులపై వస్తున్న వార్తల నడుమ సీజేపీ కన్వీనర్ అభిజిత్ దీప్కే క్లారిటీ ఇస్తూ సంచలన ప్రకటన చేశారు. తాము భవిష్యత్తులో ఎలాంటి నిరసనలు తెలపబోమని పేర్కొనే ఏ బాండ్‌పైనా తాము సంతకం చేయలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. తాము మళ్లీ వీధుల్లోకి వస్తామని తేల్చిచెప్పారు. దీంతో ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇది కూడా చదవండి:  NTR Dragon Movie | సెట్స్‌లోకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ రీ-ఎంట్రీ.. రామోజీ ఫిల్మ్ సిటీలో ‘డ్రాగన్’ కొత్త షెడ్యూల్ షురూ

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *