అక్షరటుడే వెబ్‌డెస్క్: NTR Dragon Movie | మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ ‘డ్రాగన్’. కేజీయఫ్, సలార్ చిత్రాల సంచలనం తర్వాత ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటంతో సినిమాపై నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రియుల్లోనూ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
NTR Dragon Movie | కోలుకున్న ఎన్టీఆర్..
చేతికి అయిన గాయం కారణంగా కొద్దిరోజులుగా ఎన్టీఆర్ విశ్రాంతి తీసుకోవడం, షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడటంతో అభిమానులు కొంత నిరాశకు గురయ్యారు. అయితే, ఇప్పుడు ఎన్టీఆర్ పూర్తి ఆరోగ్యంతో తిరిగి షూటింగ్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు.
NTR Dragon Movie | కొత్త షెడ్యూల్..
ఈ సినిమా తాజా షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఇప్పటికే వేగంగా సాగుతోంది. గత నాలుగు రోజులుగా ఎన్టీఆర్ లేని సీన్లను చిత్రీకరించిన చిత్రబృందం, ఈ నెల 14 నుంచి ఎన్టీఆర్ పాల్గొనే కీలక సన్నివేశాలను తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ కొత్త షెడ్యూల్లో భారీ యాక్షన్ సీక్వెన్సెస్ తో పాటు ముఖ్యమైన డ్రామా ఘట్టాలను పూర్తి చేయనున్నారు.
NTR Dragon Movie | విడుదల తేదీ..
రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్, మలయాళ నటుడు బిజూ మీనన్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కి రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్నారు. వచ్చే ఏడాది జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Eagle Force | గోవా నుంచి డ్రగ్స్ రవాణా.. ముఠా గుట్టురట్టు చేసిన ఈగల్ ఫోర్స్