అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Mobile Theft Arrest | నగరంలోని (Nizamabad) రైల్వేస్టేషన్ ఆవరణలో మొబైల్ చోరీ నిందితుడిని రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు రైల్వే ఎస్సై సాయిరెడ్డి వివరాలు వెల్లడించారు.
Mobile Theft Arrest | తనిఖీలు నిర్వహిస్తుండగా..
నగరంలోని రైల్వేస్టేషన్ ఆవరణలోని 1వ ప్లాట్‌ఫాంపై జీఆర్పీ, ఆర్పీఎఫ్, ఐడీ పార్టీ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించగా తన పేరు కమరుద్దీన్గా పేర్కొన్నాడు. పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించగా గతంలో మొబైల్ చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. అయితే ఇతడిపై గతంలోనూ కేసు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి వద్ద రూ.16వేల విలువైన ఫోన్‌తో పాటు మరో ఐదు ఫోన్లు సైతం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అతడిని న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: తప్పు ఎవరు చేసినా తప్పే.. రేవంత్ సర్కార్‌పై కోమటిరెడ్డి హాట్ కామెంట్స్!