అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Electric Car Fire | విజయవాడ బైపాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెయిలింగ్‌ను ఢీకొని విద్యుత్ కారులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు సజీవ దహనం అయ్యారు.
ఎన్టీఆర్ జిల్లా (NTR District)లోని విజయవాడ పశ్చిమ బైపాస్‌పై రోడ్డు డివైడర్‌ను ఎలక్ట్రిక్ కారు ఢీకొంది. అనంతరం కారులో మంటలు చెలరేగి, వేగంగా వ్యాపించాయి. దీంతో అందులోని నలుగురు సజీవ దహనం కాగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడి పరిస్థితి విషమంగా ఉంది. నంబూరులో జరిగిన వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులను నున్న, నంబూరు ప్రాంతాలకు చెందినవారిగా గుర్తించారు. మృతుల్లో నున్నకు చెందిన కొమ్మారెడ్డి రామ్‌దేవ్ (39), ఆయన తల్లి అరుణ, నంబూరుకు చెందిన తిగురు విజయ, ఒక చిన్నారి ఉన్నారు.
Electric Car Fire | పోలీసుల సహాయక చర్యలు
స్థానికులు గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి : Nanabiyyam Bathukamma | నాలుగో రోజు ‘నానబియ్యం బతుకమ్మ’.. నైవేద్యం ఏంటంటే..!