BJP Kamareddy Committee | బీజేపీ మహిళా మోర్చా నూతన కార్యవర్గం నియామకం

బీజేపీ కామారెడ్డి జిల్లా మహిళా మోర్చా నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: BJP Kamareddy Committee | బీజేపీ కామారెడ్డి జిల్లా మహిళా మోర్చా నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు ఆదేశాల మేరకు మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సీహెచ్​ పావని రెడ్డి నూతన కమిటీని ప్రకటించారు.

BJP Kamareddy Committee | కామారెడ్డికి చెందిన వినోద పాటిల్​..

ఈ నియామకాల్లో కామారెడ్డి (Kamareddy)కి చెందిన వినోద పాటిల్​కు ప్రధాన కార్యదర్శిగా అవకాశం దక్కింది. ప్రస్తుతం ఆమె కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 35వ వార్డు కౌన్సిలర్ గా కొనసాగుతున్నారు. వినోదతో పాటు బిచ్కుందకు చెందిన రాథోడ్ సునీత కూడా ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. అలాగే ఉపాధ్యక్షురాలిగా మాచారెడ్డి నుంచి హారిక, ఎల్లారెడ్డి నుంచి సుజాత, బాన్సువాడ నుంచి రేణుకా గౌడ్ నియమితులయ్యారు. కార్యదర్శులుగా కామారెడ్డికి చెందిన వినీల నియమితులయ్యారు. ప్రస్తుతం వినీల రాఘవాపూర్ సర్పంచ్​గా కొనసాగుతున్నారు. అలాగే కామారెడ్డికి చెందిన కవిత, ఎల్లారెడ్డి నుంచి రజిత, బాన్సువాడ నుంచి ఐశ్వర్యలు కూడా జిల్లా కార్యదర్శులుగా నియమితులయ్యారు. జిల్లా కోశాధికారిగా సుశీల, మీడియా కన్వీనర్​గా దోమకొండకు చెందిన సుజాత, సోషల్ మీడియా కన్వీనర్​గా సునంద, ఐటీ కన్వీనర్​గా అంకిత, ఆఫీస్ సెక్రటరీగా లక్ష్మి తదితర పదవుల్లో మొత్తం 22 మందిని నియమించారు. ఈ నియామకాలు తక్షణమే అమలులోకి వస్తాయని మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు పావని రెడ్డి తెలిపారు.

BJP Kamareddy Committee | ఎస్సీ మోర్చా కార్యవర్గ ప్రకటన

కామారెడ్డి జిల్లా ఎస్సీ మోర్చా నూతన కార్యవర్గాన్ని ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రేవన్ ప్రకటించారు. ఈ కమిటీలో ఉపాధ్యక్షుడిగా కామారెడ్డి నుంచి దండు రాజు, సంది సాయిరాం, బాన్సువాడ నుంచి ఎస్ లక్ష్మి, కామారెడ్డి నుంచి గంట మధు నియమితులయ్యారు. ప్రధాన కార్యదర్శులుగా కామారెడ్డికి చెందిన సుంకరి నరేష్, స్వామి, కార్యదర్శులుగా జుక్కల్ నుంచి మారుతి, బాన్సువాడ నుంచి రంజిత్, కామారెడ్డి నుంచి మాల సుభాష్, మాస్ శ్రీనివాసులు నియమితులయ్యారు. కోశాధికారిగా పాతల సాలమయ్య, మీడియా కన్వీనర్​గా మల్లేపల్లి సంతోష్, సోషల్ మీడియా కన్వీనర్​గా మెత్రి నియమితులయ్యారు. జిల్లా కార్యవర్గ సభ్యులుగా దామిని రాములు, మీసాల లక్ష్మణ్, ఎర్రదుర్గయ్య, నమివార్ విఠల్, బాబు మహారాజ్ లను నియమించారు. ఈ నియామకాలు తక్షణమే అమలులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: Nizamabad Development Fund | అభివృద్ధి కోసం స్పెషల్ ఫండ్ ఇవ్వాలి..: ఎమ్మెల్యే ధన్​పాల్​

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *