అక్షరటుడే, వెబ్డెస్క్: Pawan Khera Bail | కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరాకు సుప్రీంకోర్టు (Supreme Court) ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆరోపణలు, ఎఫ్ఐఆర్ రెండూ రాజకీయ వైరం కారణంగానే తలెత్తినట్లు కనిపిస్తున్నాయని కోర్టు వ్యాఖ్యానించింది.
పవన్ ఖేరా గతంలో ఓ సమావేశంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) భార్య రినికి భూయాన్ శర్మపై తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో ఆమె పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఈ కేసులో కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరాకు సుప్రీంకోర్టు శుక్రవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
Pawan Khera Bail | సహకరించాలని ఆదేశం
బెయిలు మంజూరు చేస్తూ ఈ కేసు దర్యాప్తునకు పూర్తిస్థాయిలో సహకరించాలని కోర్టు ఖేరాను ఆదేశించింది. అస్సాం ముఖ్యమంత్రి భార్యపై కాంగ్రెస్ నాయకుడు చేసిన ఆరోపణల నేపథ్యంలో గౌహతిలో ఈ కేసు నమోదైంది. పరువు నష్టం, ఫోర్జరీ వంటి అభియోగాలకు ఇది దారితీసింది. ఈ కేసులో మొదట పవన్ ఖేరా తెలంగాణ హైకోర్టు (Telangana High Court)లో బెయిల్ పిటిషన్ వేశారు. అక్కడ ఊరట లభించగా.. అస్సాం పోలీసులు (Assam Police) సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
విచారణ చేపట్టిన ధర్మాసనం కేసు నమోదు అయిన గౌహతి కోర్టులో బెయిల్ పిటిషన్ వేయాలని ఖేరాకు సూచించింది. అయితే గౌహతి కోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో ఆయన మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో తాజాగా ధర్మాసనం పవన్ ఖేరాకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
ఇది కూడా చదవండి..: Parag Agrawal AI Startup | ట్విట్టర్ నుంచి బయటకు.. ఏఐ లో రారాజుగా.. పరాగ్ అగర్వాల్ సరికొత్త సంచలనం!

