అక్షరటుడే, వెబ్డెస్క్: Jantar Mantar | ఢిల్లీలోని జంతర్ మంతర్ను నిరసన తెలిపే ప్రాంతాల జాబితా నుంచి ఇటీవల కేంద్ర ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే. దీనిపై పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వ స్పందనను కోరింది.
భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జయమల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం పిటిషన్పై విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు (Supreme Court) వ్యాఖ్యల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇటీవల ఢిల్లీ హైకోర్టులో కేంద్రం వాదించింది. తాజాగా ధర్మాసనం దీనిపై ప్రశ్నించింది. కోర్టు చేసిన కొన్ని మౌఖిక వ్యాఖ్యల కారణంగా దీనిని రద్దు చేశారా, లేక ఆ ప్రదేశాన్ని ఉమ్మడి నిరసన స్థలంగా ఉపయోగించడం సమర్థతకు సంబంధించి ఆలోచించి నిర్ణయం తీసుకున్నారా అని ప్రశ్నించింది. కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. కమిటీ నివేదిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
Jantar Mantar | కేంద్రానికి నోటీసులు
ఈ పిటిషన్పై వివరణ ఇవ్వాలని కేంద్రానికి, ఢిల్లీ పోలీసులకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. వారు ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేకపోతే, చట్టం తన పని తాను చేస్తుందని కీలక వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ తరఫున న్యాయవాది వాదిస్తూ.. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును అడ్డుకోలేరన్నారు.
ఇది కూడా చదవండి..: Reservation Verdict | మతం మారితే రిజర్వేషన్లు వర్తించవు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు