Kanaka Durga Mahalakshmi Alankaram | శ్రీ మహాలక్ష్మి అలంకారంలో కనకదుర్గమ్మ.. పూజా విధానం, విశిష్టతలివే!

విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Kanaka Durga Mahalakshmi Alankaram | విజయవాడ  ( Vijayawada )ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అక్టోబర్ 17 శనివారం (ఆశ్వయుజ శుద్ధ సప్తమి) రోజున ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ శ్రీ మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. మంగళప్రదమైన స్వరూపమైన మహాలక్ష్మీదేవిగా అమ్మవారు రాక్షస సంహారం చేశారని, అష్టలక్ష్ముల సమష్టి రూపమైన అమృత స్వరూపిణిగా ఈ రోజు పూజలందుకుంటారని పండితులు తెలిపారు. ఈ అలంకారంలో అమ్మవారిని దర్శించుకుంటే సకల ఐశ్వర్యాలు, విజయాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

Kanaka Durga Mahalakshmi Alankaram | అలంకరణ విశేషాలు..

మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారిని గులాబీ రంగు పట్టుచీరతో సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. రెండు చేతుల్లో తామర పూలు ధరించి, అభయ ముద్ర, వరద ముద్రలతో ఇరువైపులా గజరాజులు సేవిస్తుండగా అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తారు. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, సౌభాగ్య లక్ష్మి, సంతాన లక్ష్మి, గజలక్ష్మిల సమష్టి రూపమే ఈ మహాలక్ష్మి స్వరూపం. చండీ సప్తశతిలో చెప్పినట్లుగా సమస్త జీవుల్లో లక్ష్మీ రూపేణా సంస్థితా అని కొలిచే ఆ దుర్గాదేవిని  భక్తిశ్రద్ధలతో పూజిస్తే దారిద్య్రం  తొలగిపోయి, ధనధాన్యాలు, వ్యాపారం, కుటుంబ సౌఖ్యం వృద్ధి చెందుతాయి.

Kanaka Durga Mahalakshmi Alankaram | పూజా విధానం , నైవేద్యాలు…

సూర్యోదయానికి ముందే తలస్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలు ధరించి పూజా స్థలాన్ని సిద్ధం చేసుకోవాలి. ముందుగా వినాయక పూజ ముగించుకుని, అమ్మవారికి షోడసోపచార పూజ పూర్తి చేయాలి. ఈ రోజు మహాలక్ష్మీదేవిని తెల్లటి పూలతో అర్చించి, పసుపు, కుంకుమ, చందనం, అక్షతలు సమర్పించాలి.  నైవేద్యంగా దేవికి బెల్లంతో చేసిన పాయసం, పూర్ణాలు, అటుకులు, బెల్లం, కొబ్బరిని ప్రత్యేక నైవేద్యంగా సమర్పిస్తారు. పూజా సమయంలో శ్రీసూక్తం, లక్ష్మీ అష్టకం, కనకధారా స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠించడం విశేషం. “ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మై స్వాహా” అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. అమ్మవారికి బెల్లంతో చేసిన పాయసం, పూర్ణాలు, అలాగే అటుకులు, బెల్లం, కొబ్బరిని నైవేద్యంగా సమర్పించాలి. పూజ పూర్తయిన తర్వాత అన్నదానం చేయడం వల్ల అమ్మవారి కరుణాకటాక్షాలు లభిస్తాయి.

ఇది కూడా చదవండి:  Nandipet Durga Devi Festival | అద్భుతం.. రూ. 2.11 కోట్లతో అమ్మవారికి అలంకరణ..

 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *