అక్షరటుడే వెబ్డెస్క్: Greater Noida Family Deaths | ఉత్తరప్రదేశ్లోని ( Uttar Pradesh )గ్రేటర్ నోయిడాలో అత్యంత హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. రబుపురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో తల్లిదండ్రులతో పాటు ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం సృష్టించింది.
Greater Noida Family Deaths | అసలేం జరిగింది?
పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఆ కుటుంబం రాత్రి సమయంలో చివరిగా టీ తాగి, మ్యాగీ తిన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాతే కుటుంబ సభ్యులంతా అస్వస్థతకు గురై మరణించి ఉంటారని అనుమానిస్తున్నారు. ఫుడ్ పాయిజనింగ్ లేదా ఏదైనా ప్రమాదకర పదార్ధం అధిక మోతాదులో తీసుకోవడం వల్లే ఈ మరణాలు సంభవించి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.
Greater Noida Family Deaths | పోస్ట్మార్టం నివేదిక కోసం..
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఐదుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని పోస్ట్మార్టం నిపుణుల పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతికి గల అసలు కారణాలు తెలియాలంటే పోస్ట్మార్టం రిపోర్ట్ రావాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు వేగవంతం చేశారు.
ఇది కూడా చదవండి: Odisha Engineer | ఇంజినీర్ ఇంట్లో నోట్ల కట్టలు.. షాకైన విజిలెన్స్ అధికారులు