అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Gold Smuggling | గోల్డ్ స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త దారుల్లో విదేశాల నుంచి బంగారం అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఇటీవల గీజర్‌లో బంగారం దాచి తెచ్చిన వ్యక్తులను అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఫ్లోర్ స్ప్రింగ్‌లో తరలిస్తున్న పసిడిని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం (Delhi International Airport)లో సోమవారం ఉదయం డీఆర్ఐ అధికారులు రూ.4 కోట్ల విలువైన బంగారం సీజ్ చేశారు. దుబాయ్ నుంచి వచ్చిన ఒక భారతీయ ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. అతడి బ్యాగేజీలోని ఫ్లోర్ స్ప్రింగ్‌లు అనుమానాస్పదంగా కనిపించడంతో ఓపెన్ చేసి చూశారు. అందులో 3.2 కిలోల బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. ఆ బంగారం విలువ రూ.4.03 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.
Gold Smuggling | కేసు నమోదు
నిందితుడు అధికారులకు చిక్కకుండా ఉండేందుకు ఫ్లోర్ స్ప్రింగ్‌లో బంగారు కడ్డీలను దాచాడు. డోర్లు అటోమేటిక్‌గా మూసుకోవడానికి ఫ్లోర్ స్ప్రింగ్‌లు పని చేస్తాయి. వీటిలో మొత్తం బంగారం నింపేసి నిందితుడు తీసుకొచ్చారు. అధికారులు అతడిని క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో రహస్యంగా తరలిస్తున్న బంగారం దొరికింది. దీంతో నిందితుడిని అరెస్ట్ చేశారు. కస్టమ్స్ చట్టం, 1962 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై హత్యాయత్నం.. నిందితులను వదిలిపెట్టమన్న మహారాష్ట్ర సీఎం