Munnurukapu Dasara Celebrations | మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో దసరా సంబరాలు: మాజీ మేయర్​ ధర్మపురి సంజయ్​

మున్నూరు కాపు కులస్థుల దసరా సంబరాలు నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా మున్నూరుకాపు సంఘం అధ్యక్షుడు, మాజీ మేయర్​ ధర్మపురి సంజయ్​ పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Munnurukapu Dasara Celebrations | నిజామాబాద్​ జిల్లా ( Nizamabad) మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో మున్నూరు కాపు కులస్థుల దసరా సంబరాలు నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు, మాజీ మేయర్​ ధర్మపురి సంజయ్ (Dharmapuri Sanjay)​ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం వీడియో విడుదల చేశారు.

Munnurukapu Dasara Celebrations | అందరికీ ఆటల పోటీలు..

జిల్లా మున్నూరు కాపు సంఘం 30 ఏళ్ల క్రితం ఏర్పడిందని ధర్మపురి సంజయ్​ తెలిపారు. మొదటిసారిగా మున్నూరు కాపులందరు ఒక్కచోట కలిసి సంబరాలు నిర్వహించేందుకు నిర్ణయించామన్నారు.

ఈ సందర్భంగా 23న శుక్రవారం నగరంలోని ప్రగతినగర్​ మున్నూరుకాపు సంఘంలో ఉదయం 11 గంటలకు సంబరాలు ప్రారంభమవుతాయన్నారు. ప్రతి ఒక్క మున్నూరు కాపు కుటుంబం ఈ సంబరాల్లో పాల్గొనాలని కోరారు.

పిల్లలకు, పెద్దలకు, మహిళలకు ప్రత్యేకంగా ఆటలపోటీలు ఉన్నాయన్నారు. ప్రత్యేకంగా భోజన ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని మున్నూరుకాపు కులస్థులందరూ ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు.

ఇది కూడా చదవండి: దసరా రోజు పాలపిట్టను ఎందుకు చూడాలి? 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *