Rajasthan Twin Murder | ప్రియుడి కోసం దారుణం.. కన్న బిడ్డలనే కడతేర్చిన కసాయి తల్లి

వివాహేతర సంబంధం కోసం కడుపున పుట్టిన బిడ్డలనే కడతేర్చిన అమానుష ఘటన రాజస్థాన్ లోని డిగ్ (Degg) జిల్లాలో వెలుగు చూసింది.

Shivam nagarani

అక్షరటుడూ వెబ్‌డెస్క్:  Rajasthan Twin Murder | వివాహేతర సంబంధం కోసం కడుపున పుట్టిన బిడ్డలనే కడతేర్చిన అమానుష ఘటన రాజస్థాన్ లోని డిగ్ (Degg) జిల్లాలో వెలుగు చూసింది. దసరా పండుగ రోజున చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు అప్రమత్తమై కేవలం ఆరు గంటల వ్యవధిలోనే కేసును ఛేదించి, హంతకురాలైన కసాయి తల్లిని అరెస్టు చేశారు.

Rajasthan Twin Murder | అసలు ఏం జరిగిందంటే?

మహిళ మొదటి భర్త కొంతకాలం క్రితం మరణించడంతో, ఆమె తన పిల్లలతో కలిసి పుట్టింట్లో ఉంటోంది. ఆ సమయంలో అదే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడి, అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే, ఆ మహిళకు మొదటి భర్త ద్వారా జన్మించిన పిల్లలను పెంచుకోవడానికి ఆ ప్రియుడు నిరాకరించాడు. పిల్లలతో వస్తే ఆమెను వివాహం చేసుకోనని తేల్చిచెప్పాడు.

పిల్లలు అడ్డుగా ఉండటం వల్లే ప్రియుడు తనను దూరం పెడుతున్నాడని భావించిన ఆ కసాయి తల్లి.. అభం శుభం తెలియని తన 13 ఏళ్ల కవల కొడుకులను హత్య చేయాలని దారుణమైన నిర్ణయం తీసుకుంది.

Rajasthan Twin Murder | ఆరు గంటల్లోనే గుట్టురట్టు ..

దసరా పండుగ రోజు ఉదయం గ్రామంలోని ఒక పొలంలో ఇద్దరు బాలురు విగతజీవులుగా పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సర్కిల్ ఆఫీసర్, అదనపు ఎస్పీతో పాటు సీనియర్ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ (FSL) బృందాలను రప్పించి క్షుణ్ణంగా పరిశీలించారు.

సాంకేతిక ఆధారాలు, చుట్టుపక్కల లభించిన క్లూస్‌ను విశ్లేషించిన పోలీసులు.. కేవలం ఆరు గంటల్లోనే దర్యాప్తు పూర్తి చేసి పిల్లల తల్లే ఈ దారుణానికి పాల్పడినట్లు నిర్ధారించారు. ప్రాథమిక విచారణలో ఈ హత్య ఇంటిలోనే జరిగినట్లు తేలింది. హత్యకు ఉపయోగించిన ఆయుధం, రక్తపు మరకలున్న దుస్తులు తదితర సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు, ఈ దారుణంలో మరెవరి ప్రమేయమైనా ఉందనే కోణంలో దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు.

ఇది కూడా చదవండి:  Bhagwant Mann Fine | పంజాబ్​ సీఎం భగవంత్ మాన్​కు జరిమానా

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *