Oppo Find X10 Pro | ఒప్పో నుంచి ప్రీమియం ఫోన్.. రేపే భారత్‌లో విడుదల

ఒప్పో కంపెనీ భారత్‌లో ప్రీమియం ఫోన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఫైండ్ ఎక్స్ 10 ప్రొ ను గురువారం విడుదల చేయనుంది.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: Oppo Find X10 Pro | చైనా (China)కు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ అయిన ఒప్పో మరో ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేయడానికి రెడీ అయ్యింది. ఒప్పో ఫైండ్ ఎక్స్ 10 ప్రొ పేరుతో తీసుకువస్తున్న ఈ ఫోన్‌ను అక్టోబర్ 22న విడుదల చేయనుంది.

ఆన్ లైన్ ప్లాట్ ఫాంలలో లీకయిన సమాచారం మేరకు భారీ బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 9600 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 17 ఆపరేటింగ్ సిస్టంలతో ఈ మోడల్‌ను తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు లాంచ్ అయిన తర్వాత వెల్లడవనున్నాయి. లీకయిన సమాచారం మేరకు స్పెసిఫికేషన్స్ ఇలా ఉండే అవకాశాలున్నాయి.

డిస్‌ప్లే : 6.78 ఇంచ్ ఎల్టీపీవో ఓఎల్ఈడీ అమోలెడ్ డిస్‌ప్లే ఉండనుంది. ఇది 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 1272 x 2772 పిక్సల్స్ రిజల్యూషన్, ఐపీ69 డస్ట్, వాటర్ రెసిస్టెంట్ రేటింగ్ కలిగి ఉండనుంది.

ప్రాసెసర్ : మీడియాటెక్ డైమెన్సిటీ 9600 ప్రాసెసర్ ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఇది ఆండ్రాయిడ్ 17 ఆధారిత కలర్ ఓఎస్ 17 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుందని సమాచారం.

కెమెరా సెటప్ : వెనకవైపు 200 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు 200 మెగా పిక్సెల్ టెలీఫొటో లెన్స్, 50 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెట్ అప్ ఉండనుంది.
ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50 మెగా పిక్సెల్ కెమెరా ఇవ్వనున్నారు.

బ్యాటరీ : 7150 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. ఇది 80డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్‌ను, 50డబ్ల్యూ వైర్‌లెస్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుందని తెలుస్తోంది.

Oppo Find X10 Pro | మూడు వేరియంట్స్‌లో..

కంపెనీ ఈ ఫోన్‌ను లూనా వైట్, వార్మ్ ఆరంజ్, టైటానియం గ్రే కలర్స్ మూడు వేరియంట్స్‌లో విడుదల చేయనుంది. 12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 16 జీబీ ర్యామ్, 1 టీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ అందుబాటులోకి రానున్నాయి.

ఇది కూడా చదవండి..: Jio Platforms IPO | జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీవోకు భారీ స్పందన.. తొలి 36 నిమిషాలలోనే 100 శాతం సబ్‌స్క్రిప్షన్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *