Oct 22 Market Analysis | నష్టాల్లో ఆసియా మార్కెట్లు..నెగెటివ్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. మన మార్కెట్లు సైతం నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయన్న సంకేతాన్ని గిఫ్ట్ నిఫ్టీ ఇస్తోంది.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Oct 22 Market Analysis | పశ్చిమాసియా(West Asia)లో నిరంతర భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో ముడిచమురు ధరలు అధిక స్థాయిలలో కొనసాగుతుండడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతోంది. దీంతో ప్రధాన ఆసియా Asia మార్కెట్లు అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ(Gift nifty) నెగెటివ్‌గా ఉండడంతో మన మార్కెట్ సైతం గ్యాప్ డౌన్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Oct 22 Market Analysis | యూఎస్ మార్కెట్లు..

స్పేసఎక్స్, సూపర్ మైక్రో కంప్యూటర్ త్రైమాసిక ఫలితాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధిత స్టాక్‌లపై పెట్టుబడిదారుల ఆసక్తిని పెంచడంతో వాల్ స్ట్రీట్ రాణించింది. గత సెషన్‌లో నాస్‌డాక్ 1.05 శాతం, ఎస్ అండ్ పీ 0.58 శాతం పెరిగాయి. గురువారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.31 శాతం నష్టంతో ఉంది.

Oct 22 Market Analysis | యూరోప్ మార్కెట్లు..

జర్మనీకి చెందిన డీఏఎక్స్ 1.33 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 1.05 శాతం, యూకేకు చెందిన ఎఫ్టీఎస్ ఈ 0.18 శాతం పెరిగాయి.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

Oct 22 Market Analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు లాభాలతో ఉన్నాయి. ఉదయం 7.50 గంటల ప్రాంతంలో హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 2.49 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 2.36 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 1.08 శాతం, చైనాకు చెందిన షాంఘై 1.06 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.17 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.13 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.38 శాతం నష్టంతో ఉండడంతో మన మార్కెట్లు నష్టాలతో ప్రారంభం కానున్నాయి.

గమనించాల్సిన అంశాలు..

  • విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గత సెషన్‌లో నికరంగా రూ. 1,022 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
  • డీఐఐలు వరుసగా రెండో సెషన్‌లో నికరంగా రూ. 1,614 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 47 పైసలు బలపడి 94.46 వద్ద ఉంది.
  • క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 110.33 డాలర్ల వద్ద ఉంది.
  • యూఎస్ డాలర్ ఇండెక్స్ 101.67 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 5.10 శాతం వద్ద ఉంది.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 0.93 నుంచి 0.78 కు తగ్గింది.
  • విక్స్ 6.11 శాతం పెరిగి 15.67 వద్ద ఉంది.
  • సెన్సెక్స్ డెరివేటివ్స్ వీక్లీ ఎక్స్‌పైరీ నేపథ్యంలో మార్కెట్‌లో ఒడుదుడుకులు ఉండే అవకాశాలున్నాయి.
Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *