అక్షరటుడే వెబ్‌డెస్క్: Amazon Great Indian Festival | అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026 పండగ సీజన్‌లో దేశవ్యాప్తంగా హోమ్ అప్ గ్రేడ్స్ (ఇంటి ఆధునీకరణ) జోరుగా సాగుతున్నాయి. మెట్రో నగరాలతో పాటు చిన్న పట్టణాలు, ద్వితీయ శ్రేణి నగరాల నుంచి భారీ స్పందన వస్తోంది. లక్నో , జైపూర్ ( Jaipur ), పాట్నా, గౌహతి, కోయంబత్తూరు, నాగపూర్, ఇండోర్, కొచ్చీ వంటి మెట్రోయేతర నగరాల వాటా మొత్తం కొనుగోలు పరిమాణంలో ఏకంగా 60 శాతంగా ఉండటం విశేషం. అంతేకాకుండా, మెట్రో నగరాల కంటే రెట్టింపు వేగంతో ఈ ప్రాంతాల్లో కొనుగోళ్లు దూసుకుపోతున్నాయి.
Amazon Great Indian Festival | స్మార్ట్ ఉపకరణాలు..
ఇళ్లలోని కిచెన్ నుంచి లివింగ్ రూమ్, బెడ్రూమ్, అవుట్‌డోర్స్ వరకు అన్ని విభాగాల్లోనూ కస్టమర్లు తమ వస్తువులను లేటెస్ట్ టెక్నాలజీతో అప్‌గ్రేడ్ చేసుకుంటున్నారు. శామ్సంగ్, ఎల్జీ (LG), ఫిలిప్స్, షార్క్ నింజా, డి’లాంగీ (De’Longhi) వంటి అంతర్జాతీయ బ్రాండ్లతో పాటు లుమియో, అటమ్‌బర్గ్, ఆక్వాగార్డ్, విప్రో వంటి దేశీయ బ్రాండ్లు కూడా శక్తివంతమైన వృద్ధిని నమోదు చేస్తున్నాయి. నో-కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, తక్షణ బ్యాంక్ డిస్కౌంట్లు అందుబాటులో ఉండటంతో కస్టమర్లు ప్రీమియం ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
Amazon Great Indian Festival | కిచెన్ , లివింగ్ రూమ్ ..
కిచెన్ ఉపకరణాలు: ఎయిర్ ఫ్రైయర్లు, ఓవెన్లు, ఎస్ప్రెస్సో మెషీన్లు, డిష్ వాషర్లు, చిమ్నీల కొనుగోళ్లు భారీగా పెరిగాయి. ముఖ్యంగా 300 లీటర్లకు పైగా సామర్థ్యం గల పెద్ద రిఫ్రిజిరేటర్లు, AI-ఆధారిత స్మార్ట్ రిఫ్రిజిరేటర్లకు విశేష ఆదరణ లభిస్తోంది.
లివింగ్ రూమ్ & ఎంటర్‌టైన్‌మెంట్: పెద్ద స్క్రీన్ గల స్మార్ట్ టీవీలు, రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్లు, ఎయిర్ ప్యూరిఫైయర్లు, శక్తిని పొదుపు చేసే స్మార్ట్ ఫ్యాన్లు, కనెక్టెడ్ లైటింగ్ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.
లార్జ్ అప్లయన్సెస్: వాషర్ డ్రైయర్లు, ప్రీమియం ఫ్రంట్-లోడ్ వాషింగ్ మెషీన్లు, 4, 5-స్టార్ ఎనర్జీ రేటింగ్ కలిగిన ఏసీల కొనుగోళ్లు ఊపందుకున్నాయి.
Amazon Great Indian Festival | AI టెక్నాలజీ..
కస్టమర్లకు సరిగ్గా సరిపోయే ఉత్పత్తులను సులభంగా ఎంచుకోవడానికి అమెజాన్ ‘రూఫస్’ (Rufus) , ‘లెన్స్AI’ వంటి కృత్రిమ మేధస్సు (AI) సాధనాలను అందుబాటులోకి తెచ్చింది. హింగ్లిష్‌తో సహా 8 భారతీయ భాషల్లో వాయిస్ ప్రాంప్ట్స్ ద్వారా కావలసిన ఉత్పత్తులను వెతుక్కోవచ్చు. అలాగే డీల్ అలర్ట్స్ ద్వారా ధరలను ట్రాక్ చేస్తూ, ఉత్తమ ధరకు నచ్చిన వస్తువులను సొంతం చేసుకునే సదుపాయం కల్పించారు.
Amazon Great Indian Festival | పండగ ఆఫర్లు , డిస్కౌంట్లు..
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ పండగ సీజన్ అంతటా కొనసాగుతుండగా, లక్ష ఉత్పత్తులపై 50% వరకు తగ్గింపు, రెండు లక్షలకు పైగా ఉత్పత్తులపై సంవత్సరంలోనే అత్యంత తక్కువ ధరలు అందుబాటులో ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్ , ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులు, ఈఎంఐ లావాదేవీలపై కస్టమర్లు 10% తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు.
ఇది కూడా చదవండి: Alumni Reunion | ఉత్సాహంగా పూర్వ విద్యార్థుల రజతోత్సవ వేడుక