Sitaram Suicide Case | భర్త ఆత్మహత్య చేసుకున్న నెల రోజులకే.. ప్రియుడితో పెళ్లి

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sitaram Suicide Case | హైదరాబాద్ (Hyderabad)​లో సాఫ్ట్​వేర్​ ఉద్యోగి సీతారాం ఆత్మహత్య కేసులో మరో కీలక విషయం వెలుగు చూసింది. తన భార్యకు ఆరుగురు ప్రియులు ఉన్నారని ఆయన సూసైడ్​ నోట్​ రాసి ఫిబ్రవరిలో బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. భర్త చనిపోయిన నెల రోజులకే ఆయన భార్య రేణుక తన ప్రియుడిని పెళ్లి చేసుకోవడం గమనార్హం.

భార్య వివాహేతర సంబంధాల గురించి నిజాలు తెలుసుకున్న సీతారాం.. అవమానంతో ఆత్మహత్య చేసుకున్నాడు. 19 పేజీల సూసైడ్​ నోట్​ రాసి ఫిబ్రవరి 9న తనువు చాలించాడు. భర్త  కర్మకాండలు ముగియకముందే రేణుక తన ప్రియుడు రమణారెడ్డిని పెళ్లి చేసుకుంది. మార్చిలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్న ఫొటోలు బయటపడటం కలకల రేపుతోంది.

Sitaram Suicide Case | ముగ్గురితో వివాహేతర సంబంధం

తన భార్య రేణుక గురించి సీతారాం సూసైడ్​ నోట్​లో రాశారు. పెళ్లికి ముందే ఆమెకు ఆరుగురితో ప్రేమ కథలు ఉన్నాయని.. పెళ్లి తర్వాత ముగ్గురితో వివాహేతర సంబంధాలు పెట్టుకుందని తెలిపారు. వారితో సన్నిహితంగా ఉన్న వీడియోలను సోషల్​ మీడియా (Social Media)లో పెట్టేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ అవమాన భారంతో అతడు చనిపోయాడు. భర్త చనిపోయాడనే బాధ లేకుండా రేణుక తన ప్రియుడిని నెల రోజులకే వివాహం చేసుకోవడం గమనార్హం. పోలీసులు వీరిద్దరినీ అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

దీనిని కూడా చదవండి : Hyderabad ORR | ఓఆర్ఆర్​పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *