అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Munnurukapu Dasara Meet | మున్నూరు కాపుల ఐక్యత కోసమే దసరా ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసినట్లు మాజీ మేయర్, మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ (Dharmapuri Sanjay) అన్నారు. జిల్లా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో దసరా (Dasara Meet) పండుగను పురస్కరించుకుని ప్రగతినగర్ మున్నూరుకాపు సంఘంలో శుక్రవారం ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు.
Munnurukapu Dasara Meet | జిల్లా నలుమూలల నుంచి..
ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి మున్నూరు కాపులు విచ్చేశారు. పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. మహిళలు, పురుషులకు, పిల్లలకు మ్యూజికల్ చైర్గేమ్ ఆడించారు. గెలిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ధర్మపురి సంజయ్ మాట్లాడుతూ.. మున్నూరు కాపులు ఐక్యంగా ఉంటేనే అన్ని రంగాల్లో రాణించగలరని ఆలోచించి జిల్లా సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశామన్నారు. ఈ సమ్మేళనంతో పరిచయాలు పెరిగి, ఒకరికొకరు సహాయ సహకారాలు పెరుగుతాయన్నారు. మాజీ మంత్రి దివంగత ధర్మపురి శ్రీనివాస్ సంఘం అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారన్నారు. మున్నూరు కాపులందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు సంఘ భవనాలు నిర్మించారని గుర్తు చేశారు.
Munnurukapu Dasara Meet | అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత..
తాను జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత వనభోజనాలు ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో.. మొదటిసారి దసరా సందర్భంగా ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేశ్వర్, దారం సాయిలు, కోశాధికారి ధర్మపురి సురేందర్, బంటు రాజయ్య, ఆకుల రమేష్, దారం సాయిలు, అర్జున్ ప్రకాష్, మెండి సంతోష్, అబ్బాయి లింబాద్రి, రేంజర్ల గంగాధర్, ప్రతాప రుద్ర, కోరడి కిరణ్, బండారి జగదీష్, మిద్దె రవికుమార్, దారం పోతన్న, వరాల రాజేందర్, అంగిరేకుల సాయిలు, సుదం శ్రీనివాస్, సుగంధం శ్రీనివాస్, ఎండల సంతోష్, కోడపూ శరత్, బంటు కిషోర్, శిల్ప హన్మాండ్లు, బాబురావు, బుడుగు కిషన్ రెడ్డి, ముత్యాల శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, సుదం సాయన్న, పంచరెడ్డి శ్రీకాంత్ , బొబ్బిలి నర్సయ్య, జెట్టి గోవింద రాజు, ప్రేమ్, బైరీ శేఖర్, కర్క రమేష్, శ్రీకాంత్, శ్రీనివాస్, భూమేష్ పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: పాత రోజులు మళ్లీ తెచ్చారు…జనరేటర్లు రెడీ చేస్తున్న రైతులు