అక్షరటుడే, వెబ్డెస్క్ : SFC Environmental IPO | ఎస్ ఎఫ్ సీ ఎన్విరాన్మెంటల్ టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీని 2005 మార్చిలో ఏర్పాటు చేశారు. ఇది ప్రముఖ పర్యావరణ సాంకేతిక సంస్థ. వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్, వేస్ట్ వాటర్ రీసైక్లింగ్ అండ్ రీయూజ్, సాలిడ్ వేస్ట్ ట్రీట్మెంట్ కోసం టెక్నాలజీ, డిజైన్, ఇంజినీరింగ్, మ్యానిఫ్యాక్చరింగ్, సప్లై, ఇన్స్టాలేషన్, కమిషనింగ్ సొల్యూషన్స్ అందిస్తుంది.
ఈ సంస్థ మురుగునీరు మరియు పారిశ్రామిక కార్యకలాపాల నుంచి వెలువడే మురుగునీటిని శుభ్రపరచడానికి తన సొంత సి టెక్ టెక్నాలజీని, ఒక అధునాతన సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ ప్రక్రియను ఉపయోగిస్తుంది. ఇప్పటివరకు ఈ సంస్థ 728 మురుగునీటి శుద్ధి వ్యవస్థలను స్థాపించి, వాటిని పనిచేయించడం ప్రారంభించింది. రోజూ సుమారు 17.51 బిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధి చేయడంలో సహాయపడుతోంది.
SFC Environmental IPO | రూ. 667.53 కోట్ల సమీకరణ లక్ష్యం..
ఐపీవో (IPO) ద్వారా కంపెనీ మొత్తం రూ. 667.53 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. రూ. 2 ఫేస్ వ్యాల్యూ కలిగిన 45,45,454 తాజా షేర్లను విక్రయించి రూ. 150 కోట్లు, అలాగే ఆఫర్ ఫర్ సేల్ కింద రూ. 2 ఫేస్ వ్యాల్యూ కలిగిన 1,56,82,750 షేర్లను విక్రయించి రూ. 518 కోట్లు సమీకరించనున్నారు. పబ్లిక్ ఇష్యూ ద్వారా వచ్చిన ఆదాయాన్ని కంపెనీ తీసుకున్న రుణాలను పూర్తిగా లేదా పాక్షికంగా చెల్లించడం కోసం, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు ఇతర సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపింది.
SFC Environmental IPO | ప్రైస్ బ్యాండ్..
కంపెనీ ఒక్కో ఈక్విటీ షేరు ధరను రూ. 313 నుంచి రూ. 330 లుగా కంపెనీ నిర్ణయించింది. ఒక లాట్లో 45 షేర్లున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్ కోసం గరిష్ట ప్రైస్ బ్యాండ్ వద్ద రూ. 14,850 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
కోటా : ఐపీవోలో క్యూఐబీలకు 50 శాతం వాటా, రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం వాటా, ఎన్ ఐఐలకు 15 శాతం వాటాను కేటాయించారు.
జీఎంపీ : కంపెనీ షేర్లకు గ్రే మార్కెట్ ప్రీమియం రూ. 21 లుగా ఉంది. ఐపీవో అలాట్ అయితే సుమారు 6 శాతం లిస్టింగ్ గెయిన్స్ పొందే అవకాశం ఉంటుంది.
SFC Environmental IPO | ముఖ్యమైన తేదీలు..
ఈ మెయిన్ బోర్డు ఐపీవో అక్టోబర్ 27న ప్రారంభమవుతుంది. 29 వరకు అందుబాటులో ఉంటుంది. అక్టోబర్ 30న రాత్రి షేర్స్ అలాట్మెంట్ స్టేటస్ వెల్లడి కానుంది. కంపెనీ షేర్లు నవంబర్ 3న బీఎసఈ, ఎనఎసఈలలో లిస్ట్ అవుతాయి.
ఇది కూడా చదవండి..: Jio Platforms IPO | మదర్ ఆఫ్ ఆల్ ఐపీవోస్.. చరిత్ర సృష్టించిన జియో ప్లాట్ఫామ్స్