అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Arnab Cyclone | బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపాన్ మారింది. ఈ అర్నబ్ తుపాన్ తీరం దిశగా దూసుకొస్తుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆంధ్రలోని తీర ప్రాంతాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
అర్బన్ తుపాన్ గంటకు కి.మీ వేగంతో కదులుతుంది. సాయంత్రానికి తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. అనంతరం కోస్తాంధ్రపై విరుచుకుపడే ప్రమాదం ఉంది. దీంతో కోనసీమకు తీవ్ర ముప్పు వాటిల్లుతుందని భావిస్తున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం (AP Government), అధికారులు అప్రమత్తం అయ్యారు. బుధవారం బాపట్ల-విశాఖ మధ్య తుపాన్ తీరం దాటే అవకాశం ఉంది. వాతావరణ శాఖ అధికారులు ఏపీ, ఒడిశాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
Arnab Cyclone | అప్రమత్తంగా ఉండాలి
ప్రస్తుతం తుపాన్ విశాఖకు 650, బాపట్లకు 900 కిలోమీటర్ల దూరంలో ఉంది. మంగళవారానికి అతి తీవ్ర తుపానుగా మారి, బుధవారం తీరం దాటే అవకాశం ఉంది. దీంతో ప్రజలు నేటి నుంచి బుధవారం వరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. తీర ప్రాంత ప్రజలు సముద్రంలోకి వెళ్లొద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. ఈ తుపాన్ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో అధికంగా ఉండనుంది. కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడుతాయి.
ఇది కూడా చదవండి..: Rice Millers Scam | సన్న బియ్యానికి బదులు దొడ్డు బియ్యం సరఫరా.. మిల్లర్లపై కేసు