అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rahul Gandhi Defamation Case | పరువు నష్టం కేసులో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి కోర్టులో ఊరట లభించింది. యూపీలోని సుల్తాన్పూర్ కోర్టు సోమవారం రాహుల్ గాంధీని నిర్దోషిగా ప్రకటించింది.
రాహుల్ గాంధీ 2018లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah)ను హత్య కేసులో నిందితుడిగా పేర్కొంటూ వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులోని ఓ మీటింగ్‌లో మాట్లాడుతూ.. బీజేపీ అధ్యక్షుడు ఒక హత్య కేసులో నిందితుడనే విషయాన్ని ప్రజలు మర్చిపోతున్నారన్నారు. నిజాయితీ, మర్యాదల గురించి మాట్లాడే పార్టీకి, హత్య కేసులో నిందితుడైన వ్యక్తి అధ్యక్షుడిగా ఉన్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసును ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కాగా ఈ కేసులో అమిత్ షాను 2014లోనే కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ నాయకుడు వినయ్ మిశ్రా 2018లో పరువు నష్టం దావా వేశారు.
Rahul Gandhi Defamation Case | స్వయంగా హాజరైన రాహుల్
ఏళ్ల విచారణ అనంతరం సోమవారం సుల్తాన్పూర్ కోర్టు ఈ కేసు తీర్పు వెలువరించింది. ఈ సమయంలో రాహుల్ గాంధీ స్వయంగా కోర్టుకు హాజరయ్యారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించేవి కావని కోర్టు పేర్కొంది. దీంతో కేసు నుంచి ఆయన బయట పడ్డారు. అయితే ఈ కేసు విచారణకు వచ్చే సమయంలో ఆయన కాన్వాయ్‌లోని కార్లు ప్రమాదానికి గురయ్యాయి. ఐదు కార్లు, ఒక అంబులెన్స్ ఒకదానిని ఒకటి ఢీకొన్నాయి. ప్రమాదంలో భద్రతా సిబ్బంది, నాయకులు గాయపడగా.. రాహుల్ సురక్షితంగా బయట పడ్డారు.
ఇది కూడా చదవండి..: North Block Fire | పార్లమెంట్ సమీపంలో అగ్నిప్రమాదం