Anthropic IPO | ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీవో.. ఆంథ్రోపిక్ లక్ష్యం రూ. 9.50 లక్షల కోట్లు!

ప్రపంచ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీవో రాబోతోంది. రూ. 9.50 లక్షల కోట్లు సమీకరించాలని ఆంథ్రోపిక్ యోచిస్తోంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Anthropic IPO | ఇప్పటివరకు ప్రపంచ స్టాక్ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద ఐపీవో (IPO)గా ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ ఉంది. ఈ కంపెనీ ఈ ఏడాది జూన్ లో పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. మార్కెట్ నుంచి సుమారు రూ. 8.15 లక్షల కోట్లు(85.7 బిలియన్ డాలర్లు) సమీకరించింది. అంతకుముందు సౌదీకి చెందిన సౌదీ ఆరాంకో పేరిట అతిపెద్ద ఐపీవో రికార్డు ఉండేది. త్వరలో ఈ రికార్డును బద్దలు కొట్టడానికి ఆంథ్రోపిక్ సిద్ధమయ్యింది. ఇందుకోసం అక్టోబర్ 26న అమెరికాలోని రెగ్యులేటరీకి ఎస్ -1 పత్రాలు దాఖలు చేసింది.

Anthropic IPO | 100 బిలియన్ డాలర్ల లక్ష్యంతో..

ప్రముఖ ఏఐ స్టార్టప్, క్లాడ్ చాట్‌బాట్ సృష్టికర్త ఆంథ్రోపిక్ ఐపీవోకు సన్నాహాలు చేస్తోంది. ఈ కంపెనీ మార్కెట్ ఉంచి 100 బిలియన్ డాలర్ల వరకు నిధుల్ని సమీకరించాలని యోచిస్తోంది. ఏఐకి డిమాండ్ ఉండడంతో ఈ పబ్లిక్ ఇష్యూ స్పేస్ ఎక్స్‌ను అధిగమించే అవకాశాలున్నాయి. ఈ ఐపీవో కోసం గోల్డ్‌మన్ శాక్స్, మోర్గాన్ స్టాన్లీ వంటివి మర్చంట్ బ్యాంకర్లుగా వ్యవహరించనున్నాయి. కంపెనీ షేర్లు నవంబర్‌లో నాస్‌డాక్‌లో లిస్టవుతాయని అంచనా వేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Noel Tata | టాటా సన్స్​ ఛైర్మన్​గా చంద్రశేఖరన్ నియామకం చెల్లదు : నోయెల్ టాటా

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *