అక్షరటుడే, వెబ్‌డెస్క్: Noel Tata | టాటా సన్స్ (Tata Sons) ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా చంద్రశేఖరన్ పునఃనియామకం చెల్లుబాటును నోయెల్ టాటా సవాలు చేశారు. టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ అయిన నోయెల్ బోర్డు నిర్ణయ ప్రక్రియపై పలు ప్రశ్నలు లెవనేత్తారు. టీవీఎస్ మోటార్, చంద్రశేఖరన్ కుటుంబానికి సంబంధించిన ఒక కంపెనీతో ముడిపడి ఉన్న, బయటపెట్టని వ్యాపార లావాదేవీలపై ఆందోళన వ్యక్తం చేశారు.
టాటా సన్స్ కంపెనీ సెక్రటరీ సుప్రకాష్ ముఖోపాధ్యాయకు అక్టోబర్ 26న నోయెల్ టాటా లేఖ రాశారు. చంద్రశేఖరన్‌ను మరో ఐదేళ్లపాటు నియమిస్తూ సెప్టెంబర్ 17న ఆమోదించిన తీర్మానం చెల్లదు అని పేర్కొన్నారు. ఈ నిర్ణయానికి మద్దతుగా బోర్డు సమావేశాల రికార్డులు, ఓటింగ్ వివరాలు న్యాయపరమైన అభిప్రాయాలను తనకు అందించాలని కోరారు.
Noel Tata | ఫిబ్రవరి వరకు..
చంద్రశేఖరన్ ప్రస్తుత పదవీకాలం ఫిబ్రవరి 2027లో ముగియనుంది. దీంతో మరోసారి ఆయనను నియమించాలని ఇటీవల తీర్మానం చేశారు. అయితే ఈ అంశాన్ని సమావేశ ఎజెండాలో సరిగ్గా చేర్చలేదని నోయెల్ వాదించారు. అసలు ఎజెండాలో గానీ, సవరించిన ఎజెండాలో గానీ ఈ ప్రతిపాదనను ప్రత్యేకంగా ప్రస్తావించలేదన్నారు. టాటా సన్స్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్‌లోని ఆర్టికల్ 118 ప్రకారం ఎంపిక కమిటీ లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి..: Oct 27 Gold Prices | పండగ వేళ పసిడికి రెక్కలు.. మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు!