Pochampad Crocodile | షాకింగ్​.. చేపపిల్లల ఉత్పత్తి కేంద్రంలో మొసలి ప్రత్యక్షం

పోచంపాడ్‌లోని చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలో మొసలి పిల్ల ప్రత్యక్షమైంది.

shashi kiran Mottala

అక్షరటుడే, పోచంపాడ్: Pochampad Crocodile | పోచంపాడ్‌ (Pochampad)లోని చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలో మొసలి పిల్ల ప్రత్యక్షమైంది. దీంతో ఒక్కసారిగా అధికారులు అప్రమత్తమయ్యారు.

Pochampad Crocodile | చేపపిల్లల మధ్య..

చేపపిల్లల ఉత్పత్తి కేంద్రంలో 31వ నంబర్ సిమెంట్ నర్సరీలో మొసలి పిల్లను గుర్తించారు. ఎన్నడూలేని విధంగా నర్సరీల్లోకి మొసలి రావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. వెంటనే జిల్లా అటవీ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్​కు సమాచారం అందించారు. ఆయన ఆదేశాల మేరకు ఆర్మూర్ ఫారెస్ట్ రేంజ్ అధికారి ఆధ్వర్యంలో క్లస్టర్ ఫారెస్ట్ అధికారి గంగాధర్ నాయక్ తన బృందంతో అక్కడికి చేరుకున్నారు. మొసలి పిల్లను సురక్షితంగా పట్టుకుని వెంటనే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ)లో వదిలిపెట్టారు. మొసలి పిల్లను సురక్షితంగా తరలించిన నిజామాబాద్ అటవీ శాఖ అధికారులకు మత్స్య అభివృద్ధి అధికారి యల్. దామోదర్ కృతజ్ఞతలు తెలిపారు.

ఇది కూడా చదవండి..: Panchayat Tractor Insurance | పంచాయతీ ట్రాక్టర్లకు భారమైన బీమా.. సవాల్​గా మారిన నిర్వహణ..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *