అక్షరటుడే, డిచ్‌పల్లి: Madhav Nagar ROB Protest | మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Dharmapuri Arvind) మంగళవారం ‘నిరసన దీక్ష’ చేపట్టారు. బ్రిడ్జి వద్ద నిర్వహించిన ఈ దీక్షకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు.
Madhav Nagar ROB Protest | తీవ్ర ఇబ్బందుల్లో ప్రజలు..
బ్రిడ్జి పనులు పూర్తికాకపోవడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఉద్యోగులు, సాధారణ ప్రజలు, వాహనదారులు ఇలా ప్రతిఒక్కరూ ఈ ఆర్వోబీ పనుల ఆలస్యం కావడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన పనులను పూర్తి చేయించాలని వారు డిమాండ్ చేశారు. దీక్షలో ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, పోతన్కర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Madhav Nagar ROB Protest | ట్రాఫిక్ మళ్లింపు..
మాధవనగర్ బ్రిడ్జి వద్ద బీజేపీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష కొనసాగుతుండటంతో పోలీసులు ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు. డిచ్‌పల్లి నుంచి నిజామాబాద్ వైపు రాకపోకలు సాగించే వాహనాలను బైపాస్ మీదుగా మళ్లిస్తున్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని పోలీసులు సూచిస్తున్నారు. ఏసీపీ ప్రకాష్ యాదవ్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి నిరసన దీక్షను పర్యవేక్షిస్తున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు చేపడుతున్నారు.
ఇది కూడా చదవండి..: Pochampad Crocodile | షాకింగ్.. చేపపిల్లల ఉత్పత్తి కేంద్రంలో మొసలి ప్రత్యక్షం..