Cybercrime and Drug Control | సైబర్ నేరాలు, డ్రగ్స్​ నియంత్రణపై ప్రణాళికతో ముందుకెళ్లాలి : సీపీ సాయిచైతన్య

సైబర్ నేరాలు, డ్రగ్స్​ నియంత్రణపై ప్రణాళికతో ముందుకెళ్లాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Cybercrime and Drug Control | సైబర్ నేరాలు, డ్రగ్స్​ నియంత్రణపై ప్రణాళికతో ముందుకెళ్లాలని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) అన్నారు. మెండోరా​లో 54 సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు.

Cybercrime and Drug Control | సీసీ కెమెరాలతో గ్రామానికి భద్రత..

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ఎంతో సంతోషమన్నారు. ఒక్క సీసీ కెమెరా అనేది 100 మంది పోలీసులతో సమానమన్నారు. సీసీ కెమెరాల ద్వారా గ్రామంలో జరిగే అనుమానాస్పద కార్యకలాపాలను సులభంగా గుర్తించి తక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. పోలీస్ శాఖ చేపడుతున్న కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలకు ప్రజలు ముందుకొచ్చి భాగస్వాములు కావాలని సూచించారు. ప్రతిఒక్కరూ వారి భద్రత కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఆర్మూర్ రూరల్ సీఐ జాన్ రెడ్డి, మెండోరా ఎస్సై సుహాసిని, మెండోరా  వీడీసీ ఛైర్మన్ మోహన్ రెడ్డి, ప్రభాకర్, సర్పంచ్ ప్రమోద్  పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Nizamabad BJP Protest | ఢిల్లీకి మూటలు మోసే ముఠామేస్త్రీ రేవంత్ రెడ్డి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *