Infinix GT 50 Pro | ఇన్ఫినిక్స్‌నుంచి ప్రీమియం ఫోన్.. స్టైలిష్ లుక్స్‌తో జీటీ 50 ప్రొ విడుదల

బడ్జెట్ ఫోన్ల తయారీ కంపెనీ అయిన ఇన్ఫినిక్స్.. ప్రీమియం ఫోన్ తీసుకువచ్చింది. జీటీ 50 ప్రొ పేరుతో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: Infinix GT 50 Pro | చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ అయిన ఇన్ఫినిక్స్ భారత మార్కెట్‌లోకి ప్రీమియం ఫోన్‌ను తీసుకువచ్చింది. జీటీ 50 ప్రొ పేరుతో మంగళవారం(అక్టోబర్ 27) కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. స్టైలిష్ లుక్‌తో తీసుకువచ్చిన ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే మీడియాటెక్ డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్ అమర్చారు. 6500 ఎంఏహెచ్ బ్యాటరీ, 45డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ వంటి ప్రత్యేకతలున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)లో ప్రీ బుకింగ్స్ ప్రారంభమైన ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ తెలుసుకుందామా..

డిస్‌ప్లే : 6.78 ఇంచ్ 1.5కే అమోలెడ్ డిస్‌ప్లే అమర్చారు. ఇది 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 1208 2644 పిక్సల్స్ రిజల్యూషన్ కలిగి ఉంది.
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్ ఇస్తుంది. ఐపీ64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ ఉంది.

సాఫ్ట్‌వేర్ : మీడియాటెక్ డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో వచ్చిన ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఎక్స్ వోఎస్ ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది.

Infinix GT 50 Pro | కెమెరా సెటప్..

వెనకవైపు 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ తో కూడిన డ్యుయల్ కెమెరా సెట్ అప్ ఉంది. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13 మెగా పిక్సెల్ కెమెరా ఇచ్చారు.

Infinix GT 50 Pro | బ్యాటరీ సామర్థ్యం..

6500 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఇది 45డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్‌ను, 30డబ్ల్యూ వైర్ లెస్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.

Infinix GT 50 Pro | సింగిల్ వేరియంట్..

బ్లాక్, రెడ్ బ్లేజ్ కలర్స్‌లో 12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సింగిల్ వేరియంట్‌లో తీసుకువచ్చారు. దీని ధర రూ. 69,999.

కార్డ్ ఆఫర్స్ : హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ. 5 వేల వరకు డిస్కౌంట్, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో 5 శాతం వరకు క్యాష్ బ్యాక్ లభించనున్నాయి.

ఇది కూడా చదవండి..: Stock Market | మార్కెట్‌లో తీవ్ర ఒడిదుడుకులు.. ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *