అక్షరటుడే వెబ్‌డెస్క్: Parachute Advanced Gold | పొడవాటి జడలు, స్నేహితులతో కలసి ఆడిన ఆటలు, అంతులేని నవ్వులు నిండిన బాల్యం ప్రతీ ఒక్కరి జీవితంలోనూ మరపురానిది. వయసు పెరిగేకొద్దీ జీవితంలో కొత్త బాధ్యతలు వచ్చి చేరినా, ప్రతీ స్త్రీ మనసులోని ఆ చిన్నారి ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లోని మహిళలు తమ అంతరాత్మలోని ఆ చిన్నారిని తిరిగి కలుసుకునేలా, బాల్యపు మధుర జ్ఞాపకాలను, స్వేచ్ఛను మళ్లీ వేడుక చేసుకునేలా పారాచూట్ అడ్వాన్స్డ్ గోల్డ్ కోకోనట్ హెయిర్ ఆయిల్ ‘ఫీల్ లైక్ ఎ గర్ల్ అగైన్’ అనే హృద్యమైన నూతన బ్రాండ్ ప్రచారాన్ని ఆవిష్కరించింది.
Parachute Advanced Gold | అద్భుత దృశ్యకావ్యం..
గత 25 ఏళ్లుగా ఎన్నటికీ నిలిచిపోయే ఐకానిక్ చిత్రాలు, పాటలతో తనదైన ముద్ర వేసిన దక్షిణ భారత ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ సినిమాటిక్ ప్రచార చిత్రానికి దర్శకత్వం వహించారు. దైనందిన జీవితంలోని ఒత్తిళ్లు, బాధ్యతల నుంచి కాస్త విరామం తీసుకున్న ముగ్గురు స్నేహితులు.. సముద్ర తీరంలో స్వేచ్ఛగా పరిగెడుతూ, నృత్యం చేస్తూ, గాలిలో ఊగుతున్న తమ పొడవైన జడలతో చిన్ననాటి సరదాలను మళ్లీ అనుభవించే దృశ్యాలను ఆయన అత్యంత అందంగా తెరకెక్కించారు.
Parachute Advanced Gold | సాంకేతిక నిపుణుల బృందం..
ఈ ప్రకటన చిత్రానికి దక్షిణ భారతదేశానికి చెందిన ప్రముఖ ప్రతిభావంతులు పనిచేసి ఒక మ్యాజిక్‌ను సృష్టించారు. ప్రముఖ సంగీత దర్శకుడు కార్తీక్ ఆకట్టుకునే అసలు సిసలు సంగీతాన్ని అందించగా, శ్వేతా మోహన్ ఆత్మను హత్తుకునేలా గానం చేశారు. అనంత శ్రీరామ్ అందించిన భావోద్వేగభరితమైన సాహిత్యం ఈ గీతానికి మరింత అందాన్ని తెచ్చింది. ప్రఖ్యాత కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ సాంప్రదాయక శైలిలోని డ్యాన్స్ మూమెంట్స్‌తో పాత జ్ఞాపకాలు, ఆప్యాయత నిండిన ఈ సంగీత అనుభవాన్ని సంపూర్ణం చేశారు.
బ్రాండ్ ఆలోచనపై మారిగో లిమిటెడ్ ఇండియా సీఎంఓ విక్రమ్ కర్వాల్ వ్యాఖ్యలు..
“నేటి వినియోగదారులు కేవలం తమ అవసరాలను తీర్చేవి మాత్రమే కాకుండా, తమ జీవితాలను తీర్చిదిద్దే భావోద్వేగాలు, జ్ఞాపకాలను అర్థం చేసుకునే బ్రాండ్ల కోసం చూస్తున్నారు. పొడవాటి జుట్టు అనేది బాల్యంలోని మధుర జ్ఞాపకాలతో బలమైన అనుబంధంగా పనిచేస్తుందనే ఆలోచనతోనే ‘ఫీల్ లైక్ ఎ గర్ల్ అగైన్’ రూపుదిద్దుకుంది. అందమైన పొడవాటి జుట్టు తెచ్చే ఆత్మవిశ్వాసం, స్వేచ్ఛకు ప్రాణం పోస్తూ, సాంస్కృతికంగా ప్రతిధ్వనించే కథనంతో ఈ భావోద్వేగాన్ని వేడుక చేసుకుంటున్నాం” అని మారిగో లిమిటెడ్ ఇండియా సీఎంఓ విక్రమ్ కర్వాల్ తెలిపారు.
చిన్ననాటి ఆనందాలను పునరుజ్జీవింపజేయాలన్న దర్శకుడు గౌతమ్ మీనన్..
ఈ ప్రాజెక్ట్‌పై తన అనుభవాన్ని పంచుకుంటూ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ మాట్లాడారు. “ఈ ప్రచారంలో ఉన్న సందేశంలోని సరళతే నన్ను దీనికి ఆకర్షించింది. వయసుతో సంబంధం లేకుండా ప్రతీ మహిళలోనూ నవ్వడానికి, ఆడుకోవడానికి, స్వేచ్ఛగా ఉండటానికి అర్హత ఉన్న ఒక చిన్నారి ఉంటుంది. స్నేహం, పాత జ్ఞాపకాలు, సంగీతం , ఆంధ్రప్రదేశ్ సుపరిచితమైన అందాల ద్వారా ఆ భావోద్వేగాన్ని ఒడిసిపట్టుకున్నాం. మహిళలను ఇంత హృదయపూర్వకంగా కీర్తించే ప్రచారంలో భాగమైనందుకు గర్వపడుతున్నాను” అని ఆయన పేర్కొన్నారు.
Parachute Advanced Gold | ఆంధ్రప్రదేశ్ మహిళలకు ..
‘ఫీల్ లైక్ ఎ గర్ల్ అగైన్’ కార్యక్రమంలో భాగంగా, పారాచూట్ అడ్వాన్స్డ్ గోల్డ్ ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh )వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ ప్రత్యేక ఆహ్వానం పలుకుతోంది. తమ బిజీ లైఫ్‌లో కాసేపు సేదతీరి, ఆ నిశ్చింత క్షణాలను మళ్లీ అనుభవించాలని, తమలో ఇంకా జీవిస్తున్న చిన్నారిని, పొడవైన జుట్టు ఇచ్చే ఆనందాన్ని మనసారా వేడుక చేసుకోవాలని సంస్థ కోరుతోంది.
ఇది కూడా చదవండి: Seethakka Development Works | ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వం