అక్షరటుడే వెబ్‌డెస్క్: Stock Market Today | ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ నష్టాలతో ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్‌డౌన్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
ఊహించినట్లుగానే యూఎస్(US) ఫెడరల్ రిజర్వ్ తన కీలక పాలసీ రేటును యథాతథంగా ఉంచడంతో గత సెషన్‌లో వాల్‌స్ట్రీట్ లాభాలతో ముగిసింది. ప్రధాన ఆసియా మార్కెట్లు(Asian markets) మాత్రం మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ నష్టాలతో ఉండడంతో మన మార్కెట్లు బలహీనంగా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
Stock Market Today | యూఎస్ మార్కెట్లు..
గత సెషన్‌లో నాస్‌డాక్ 0.27 శాతం, ఎస్ అండ్ పీ 0.28 శాతం లాభపడగా.. గురువారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.44 శాతం లాభంతో ఉంది.
ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ నష్టాలతో ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్‌డౌన్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.యూరోప్ మార్కెట్లు..
జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.44 శాతం, యూకేకు చెందిన ఎఫ్టీఎస్ఈ 0.07 శాతం లాభపడగా.. ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ ఫ్లాట్ గా ముగిసింది.
Stock Market Today | ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాలతో ఉన్నాయి. ఉదయం 8 గంటల ప్రాంతంలో సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.51 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.25 శాతం లాభంతో ఉండగా.. సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 2.33 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 1.42 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.63 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.26 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.26 శాతం నష్టంతో ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ డౌన్ లో ప్రారంభం కానున్నాయి.
Stock Market Today | గమనించాల్సిన అంశాలు..
విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు వరుసగా రెండో సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. నికరంగా రూ. 871 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
డీఐఐలు గత సెషన్‌లో నికరంగా రూ. 643 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
డాలర్‌తో రూపాయి మారకం విలువ 10 పైసలు బలహీనపడి 95.22 వద్ద ఉంది.
క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 114.20 డాలర్ల వద్ద ఉంది.
యూఎస్ డాలర్ ఇండెక్స్ 102.07 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.99 శాతం వద్ద ఉంది.
నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 1.06 నుంచి 1.07 కు పెరిగింది.
విక్స్ 0.96 శాతం తగ్గి 16.24 వద్ద ఉంది.
సెన్సెక్స్ డెరివేటివ్స్ వీక్లీ, మంత్లీ ఎక్స్‌పైరీ నేపథ్యంలో మార్కెట్‌లో ఒడిదుడుకులు ఉండే అవకాశాలున్నాయి.
ఇది కూడా చదవండి: Nizamabad Police Arrests | పోలీసుల విధులకు ఆటంకం.. ముగ్గురి అరెస్టు..