Sports Competitions | ఓటమి నుంచి పాఠం నేర్చుకోవాలి : ఎమ్మెల్యే భూపతిరెడ్డి

క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓటమిని చూసి నిరుత్సాహపడకుండా కొత్త పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగాలని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, డిచ్​పల్లి: Sports Competitions | క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓటమిని చూసి నిరుత్సాహపడకుండా కొత్త పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగాలని రూరల్ ఎమ్మెల్యే డా.భూపతి రెడ్డి అన్నారు. ఖిల్లా డిచ్‌పల్లి ఉన్నత పాఠశాలలో ఎస్‌జీఎఫ్ మండలస్థాయి క్రీడా పోటీలను ప్రారంభించారు.

Sports Competitions | ఆత్మవిశ్వసాన్ని పెంచుతాయి

ఎమ్మెల్యే (MLA Dr. Bhupathi Reddy) మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి తమ ప్రతిభను చాటుకోవాలని ఆకాంక్షించారు. క్రీడలు శారీరక దారుఢ్యాన్ని పెంపొందించడంతో పాటు మానసిక ఉల్లాసాన్ని, క్రమశిక్షణను, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని పేర్కొన్నారు. గ్రామీణ క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం గ్రామీణప్రాంతాల్లో ఎంతో ప్రతిభ, నైపుణ్యం కలిగిన విద్యార్థులు ఉన్నారని, వారిలోని సామర్థ్యాలను వెలికితీసి తగిన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్‌తో పాటు వివిధ క్రీడా పోటీలను నిర్వహిస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తోందన్నారు.

Sports Competitions | రూరల్​లో యంగ్​ ఇండియా ఇంటిగ్రేటెట్​ స్కూల్​..

విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు పాఠశాల స్థాయి నుంచే క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థులను ఈ దిశగా ప్రోత్సహించాలని ఎమ్మెల్యే కోరారు. పిల్లల చదువులు తల్లిదండ్రులకు ఆర్థిక భారంగా మారకుండా ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తూ ఉచితంగా నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ఇందులో భాగంగా రూరల్ నియోజకవర్గానికి రూ.200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరైందన్నారు. దాని నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. అదేవిధంగా ధర్పల్లి మండలంలో రూ.8 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

డిచ్‌పల్లి మండలానికి రూ.2.5 కోట్లతో ఎస్టీ బాలుర వసతి గృహం మంజూరైందని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే మానవతా సదన్‌లోని పిల్లల సంక్షేమం, విద్యాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని రూ.8.5 కోట్లతో వసతి గృహం మంజూరైందని వెల్లడించారు. ఈ వసతి గృహానికి త్వరలో శంకుస్థాపన చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ యాదగిరి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సీతయ్య, ఏఎంసీ మాజీ ఛైర్మన్ ముప్ప గంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు అమృతాపూర్ గంగాధర్, తారాచంద్ నాయక్, పొలాసని శ్రీనివాస్, ఉమ్మాజి నరేష్, సుదర్శన్, ఏజీ దాస్, ధర్మాగౌడ్, నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Shriram Finance Scholarships | శ్రీరామ్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో మెరిట్ స్కాలర్‌షిప్స్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *