అక్షరటుడే వెబ్‌డెస్క్: Indian Railways Parcel Service | వినియోగదారులకు మరింత సులువైన , వేగవంతమైన సేవలందించేందుకు భారతీయ రైల్వేస్ ఓ అద్భుతమైన నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. ‘ఘర్ సే ఘర్ తక్’ పేరిట నేరుగా కస్టమర్ల ఇంటి వద్దకే వచ్చి పార్సిళ్లను స్వీకరించి, గమ్యస్థానాలకు చేర్చే ‘డోర్-టు-డోర్’ పార్సిల్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. మొదట చేపట్టిన పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో, ప్రస్తుతం ఈ సేవలను హైదరాబాద్, ఢిల్లీ, ముంబై ( Mumbai ), కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్, బెంగళూరు , పుణె నగరాలకు విస్తరించింది. ఈ నూతన సదుపాయం ద్వారా కస్టమర్లు రైల్వే పార్సిల్ ఆఫీస్‌కు వెళ్లే పనిలేకుండా, ఇంట్లో నుంచే ‘రైల్ పార్సిల్ యాప్’ (Rail Parcel App) ఉపయోగించి సులభంగా బుకింగ్ చేసుకోవచ్చు.
Indian Railways Parcel Service | ప్రైవేట్ లాజిస్టిక్స్ భాగస్వామ్యం.
ఈ డోర్-టు-డోర్ సేవలను పకడ్బందీగా నిర్వహించేందుకు రైల్వే శాఖ ప్రైవేట్ లాజిస్టిక్స్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. బుకింగ్ నమోదు కాగానే ప్రైవేట్ భాగస్వామి సిబ్బంది నేరుగా వినియోగదారుల ఇంటి వద్దకే వచ్చి పార్సిల్‌ను సేకరిస్తారు. అనంతరం తమ లోకల్ లాజిస్టిక్స్ హబ్‌కు తీసుకెళ్లి బరువు, కొలతలు సరిచూశాక బార్‌కోడింగ్, భద్రత కోసం అదనపు ప్యాకింగ్ , లేబులింగ్ పూర్తి చేస్తారు. ఆ తర్వాత పార్సిల్‌ను సంబంధిత రైల్వే స్టేషన్‌కు తరలించి అధికారులకు అప్పగిస్తారు.
Indian Railways Parcel Service | నేరుగా ఇంటికే చేరవేత..
స్టేషన్లో పార్సిల్ స్వీకరించిన తర్వాత భారతీయ రైల్వే దానిని కేటాయించిన పార్సిల్ వ్యాన్లలో భద్రంగా లోడ్ చేసి గమ్యస్థానానికి చేరవేస్తుంది. పార్సిల్ సంబంధిత స్టేషన్‌కు చేరుకున్న వెంటనే, అక్కడి ప్రైవేట్ లాజిస్టిక్స్ భాగస్వామి దానిని రిసీవ్ చేసుకుంటారు. అక్కడ ఉన్న తమ లోకల్ డెలివరీ హబ్ ద్వారా నేరుగా గ్రహీత (రిసీవర్) ఇంటి వద్దకే తీసుకెళ్లి పార్సిల్‌ను సురక్షితంగా అందజేస్తారు.
Indian Railways Parcel Service | ముందస్తు బుకింగ్ వెసులుబాటు..
వినియోగదారుల సౌకర్యార్థం రైలు బయలుదేరడానికి 15 రోజుల ముందు నుంచి ఒక రోజు ముందు వరకు యాప్ ద్వారా బుకింగ్ చేసుకునే వెసులుబాటును రైల్వే కల్పించింది. అంతేకాకుండా, పండుగల సీజన్లో వినియోగదారులకు ఊరట కలిగిస్తూ పార్సిల్ కోచ్‌ల రౌండ్-ట్రిప్ బుకింగ్‌లపై ఏకంగా 25 శాతం రాయితీ (డిస్కౌంట్) అందిస్తున్నట్లు ఇండియన్ రైల్వేస్ వెల్లడించింది.
ఇది కూడా చదవండి: PNB Bank Scam | ఓటీపీ లేదు.. మెసేజ్ లేదు.. పీఎన్బీలో రూ.35 కోట్లు మాయం