Theni Prison Escape | ఖైదీలు పారిపోయిన ఘటన.. డిప్యూటీ జైలు సూపరింటెండెంట్​పై వేటు

ఖైదీలు పారిపోయిన ఘటనలో డిప్యూటీ జైలు సూపరింటెండెంట్​ను సీఎం విజయ్​ సస్పెండ్​ చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Theni Prison Escape | తమిళనాడు (Tamil Nadu)లోని తేని జిల్లాలో గల జైలు నుంచి ఇటీవల ఖైదీలు పారిపోయిన విషయం తెలిసిందే. కారాగరం గోడలు బద్దలు కొట్టుకొని 17 మంది తప్పించుకున్నారు. ఈ ఘటనతో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

ఈ క్రమంలో ముఖ్యమంత్రి విజయ్​ కీలక నిర్ణయం తీసుకున్నారు.
తప్పించుకున్న ఖైదీలను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటనకు బాధ్యుడిని చేస్తూ డిప్యూటీ జైలు సూపరింటెండెంట్‌ను సీఎం విజయ్​ శనివారం సస్పెండ్​ చేశారు. అక్టోబర్ 26న ఖైదీలు తప్పించుకున్న ఘటనకు దారితీసిన భద్రతా లోపాల విషయంలో, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు తెక్కంపట్టి సబ్-జైలు ఇన్‌చార్జి డిప్యూటీ జైలు సూపరింటెండెంట్‌ ఎన్. రామలింగంను సస్పెండ్ చేశారు. మిగతా సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Theni Prison Escape | బదిలీలకు ఆదేశం

తేని జిల్లాలో జరిగిన జైలు బద్దలు కొట్టిన ఘటనపై స్పందిస్తూ, విధి నిర్వహణలో నిర్లక్ష్యం, భద్రతా లోపాలపై జైలు అధికారులపై ముఖ్యమంత్రి క్రమశిక్షణా చర్యలకు ఆదేశించారు. ఈ ఘటనలో 17 మంది ఖైదీలు నకిలీ వైద్య అత్యవసర పరిస్థితిని సృష్టించి, జైలు గార్డులను లొంగదీసుకుని తప్పించుకున్నారు. దీంతో డిప్యూటీ జైలు సూపరింటెండెంట్​ను సస్పెండ్ చేయడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నత జైలు పరిపాలనాధికారులను బదిలీ చేయాలని సీఎం ఆదేశించారు.

ఇది కూడా చదవండి..: Jahangirpuri LPG Blast | మద్యం మత్తులో దారుణం.. సొంత ఇంటికే నిప్పు..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *