Singer Mangli | సింగర్ మంగ్లీని బహిష్కరించాలని ఫిర్యాదు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Singer Mangli | సింగర్ మంగ్లీని సినిమా ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలని మా (MAA) అసోసియేషన్​కు ఫిర్యాదు అందింది. తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ సంపత్ నాయక్ మంగ్లీపై ప్రొడ్యూసర్ కౌన్సిల్​కు ఫిర్యాదు చేశారు.

మంగ్లీ ఇటీవల ఓ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. రియల్ ఎస్టేట్ (Real Estate) పెట్టుబడుల పేరుతో రమావత్​ మధు అనే వ్యక్తి ప్రజలను మోసం చేశాడు. శుభక్షేత్ర వెంచర్ పేరుతో 31 మంది వద్ద రూ.6.58 కోట్లు వసూలు చేసి పరారు అయ్యాడు. అయితే మధు మంగ్లీ పేరును సైతం వాడుకున్నాడు. ఈ వ్యవహారంలో సింగర్​ మంగ్లీతో పాటు అతడి తమ్ముడి పాత్ర ఉందని న్యాయవాది సుబ్బరావు ఆరోపించారు. అయితే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంగ్లీ సుబ్బారావుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Singer Mangli | న్యాయం జరిగే వరకు..

రియల్​ ఎస్టేట్​ మోసం కేసులో నిరుపేద బాధితులకు న్యాయం జరిగే వరకు మంగ్లీని బహిష్కరించాలన్న సంపత్ నాయక్ డిమాండ్​ చేశారు. మైక్రో ఫైనాన్స్ పేరిట డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలపై పంజాగుట్ట పీఎస్​లో మంగ్లీపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు రమావత్ మధును పోలీసులు అరెస్ట్ చేశారు. దీని వెనుక ఎవరెవరు ఉన్నారని పోలీసులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఆమెను సినిమా ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలని ఫిర్యాదు రావడం గమనార్హం. దీనిపై మా అసోసియేషన్​ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

దీనిని కూడా చదవండి : Ponnam Prabhakar | దేశంలో నియంతృత్వానికి తావులేదు : మంత్రి పొన్నం ప్రభాకర్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *