Sardar Vallabhbhai Patel | జాతీయ ఐక్యతకు కృషి చేసిన మహానుభావుడు వల్లభాయ్ పటేల్

జాతీయ ఐక్యత కోసం కృషి చేసిన మహానుభావులు ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ అని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ తెలిపారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Sardar Vallabhbhai Patel | జాతీయ ఐక్యత కోసం కృషి చేసిన మహానుభావులు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ తెలిపారు. పటేల్ జయంతి సందర్భంగా శనివారం నగరంలోని వర్ని చౌరస్తాలో ఉన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

Sardar Vallabhbhai Patel | సంస్థానాలను విలీనం చేయడంలో..

ఎమ్మెల్యే (MLA Dhanpal) మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 562 సంస్థాలను విలీనం చేయడంలో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. దేశ సమగ్రత ఐక్యతకోసం ఆయన చూపిన మార్గం నేటి తరానికి స్ఫూర్తి దాయకమన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గుజరాత్​లో ప్రపంచంలోనే ఎత్తైన ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ పటేల్ విగ్రహాన్ని నిర్మించి ఘనమైన నివాళి అందించారన్నారు. అలాగే నిజాం నిరంకుశ పాలనకు ముగింపు పలికి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావడానికి పటేల్ కీలక నిర్ణయాలు తీసుకున్నారన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి, బీజేపీ కార్పొరేటర్లు కల్పే అర్చనా చిరంజీవి, జగదీష్ కులకర్ణి, మల్కాయి మహేందర్, మఠం పవన్, న్యాలం సునీత రాజు, నాయకులు కల్పె చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Child Safety Awareness | పిల్లలకు సురక్షిత బాల్యం కల్పించడం అందరి బాధ్యత..: సీనియర్ సివిల్ జడ్జి నాగరాణి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *