అక్షరటుడే, కామారెడ్డి: Child Safety Awareness | పిల్లలకు సురక్షిత బాల్యం అందించడం అందరి బాధ్యత అని సీనియర్ సివిజ్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టి.నాగరాణి అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సురక్షిత బచ్పన్ అభియాన్, పోక్సో చట్టం, పిల్లలకు సురక్షిత ఇంటర్నెట్ వినియోగంపై మాచారెడ్డి (Macha Reddy) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
Child Safety Awareness | పిల్లలు దేశ భవిష్యత్తుకు పునాది..
ప్రతి చిన్నారికి భయరహితమైన, సురక్షితమైన బాల్యాన్ని అందించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని నాగరాణి పేర్కొన్నారు. పిల్లలు దేశ భవిష్యత్తుకు పునాదులని, వారు ఆరోగ్యకరమైన వాతావరణంలో ఎదిగినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. బాలలపై జరిగే లైంగిక వేధింపులు, అక్రమ రవాణా, బాల కార్మికత్వం వంటి వాటిని అరికట్టేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ లిలియాని, చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ జి. స్వరూప, కోర్టు సిబ్బంది ఖాజా సమీ ఉల్లాహ్ ఖాన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: ISRO Student Visit | సాంకేతిక, శాస్త్ర విజ్ఞాన రంగాల్లో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు