Murasu Cyclone | తీరం దాటిన మురాసు తుపాన్​.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు

మురాసు తుపాన్​ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Murasu Cyclone | బంగాళాఖాతంలో ఏర్పడిన మురాసు తుపాన్​ తీరాన్ని దాటింది. మంగళవారం తెల్లవారుజామున 3:30 గంటల నుండి 5:30 గంటల మధ్య ఒంగోలు సమీపంలో తీరాన్ని తాకింది. దీంతో బలమైన గాలులు వీస్తున్నాయి. ఏపీలోని పలు జిల్లాల్లో ఉదయం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

తుపాన్​ ప్రభావంతో ఒంగోలు, చీరాల, బాపట్ల తీర ప్రాంతాల్లో గంటకు 120–155 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి. బాపట్ల, కృష్ణా, ప్రకాశం, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ (విజయవాడ) జిల్లాలకు అధికారులు రెడ్​ అలర్ట్ జారీ చేశారు. కొండేపి టంగుటూరు రోడ్డుపై చెట్లు పడిపోవడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. వర్షాల నేపథ్యంలో సింగరాయకొండ రైల్వే స్టేషన్​లో కొల్లామ్ వైజాగ్ ఎక్స్‌ప్రెస్ నిలిపివేశారు.

Murasu Cyclone | తెలంగాణలో..

తుపాన్​ ప్రభావంతో తెలంగాణ (Telangana)లోని ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి-కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో నేడు సాయంత్రం నుండి బుధవారం ఉదయం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నల్గొండ, యాదాద్రి-భువనగిరి, నాగర్‌కర్నూల్, జనగామ, ములుగు, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్​ ఉంది.

ఇది కూడా చదవండి..: మంత్రి దామోదరపై ఆరోపణలు… ఖండించిన చిట్టిబాబు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *