అక్షరటుడే, బాల్కొండ: Boy Murder Case | బాలుడి హత్య కేసులో నిందితుడికి నిజామాబాద్ న్యాయస్థానం జీవితఖైదు విధించింది. ఈ మేరకు బాల్కొండ (balkonda) పోలీసులు వివరాలు వెల్లడించారు.
Boy Murder Case | చిట్టాపూర్ గ్రామానికి చెందిన..
చిట్టాపూర్ గ్రామానికి చెందిన ఓ మహిళ తన 12ఏళ్లు తన చిన్న కుమారుడు కనిపించడం లేదని బాల్కొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ప్రకారం 11-09-2024న సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో బండి నరేందర్ అనే వ్యక్తి ఆమె ఇంటికి వచ్చి, గణేష్ విగ్రహాలు చూపిస్తానని చెప్పి ఆమె చిన్న కుమారుడిని తన బైక్‌పై తీసుకెళ్లాడు. కొంత సమయం తర్వాత బాలుడు ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు నరేందర్‌ను ఫోన్‌లో సంప్రదించగా, చిట్టాపూర్ గ్రామంలోని కుమ్మరి సంఘం గణేష్ విగ్రహం వద్ద బాలుడిని వదిలివచ్చానని తెలిపాడు. అయితే, అక్కడ పరిసర ప్రాంతాల్లో వెతికినా బాలుడు కనిపించలేదు. ఈ ఘటనపై బాల్కొండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో నిందితుడు బండి నరేందర్ నేరానికి పాల్పడినట్లు సాక్ష్యాధారాల ద్వారా నిరూపితమైంది.
Boy Murder Case | బాలుడిని దారుణంగా..
బాలుడిని తీసుకెళ్లిన నరేందర్ అతడిపై లైంగిక దాడికి ప్రయత్నించగా.. అతడు ప్రతిఘటించడంతో బండరాయితో కొట్టి దారుణంగా హత్య చేసినట్ల రుజువైంది. దీంతో నిజామాబాద్‌లోని పోక్సో ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి దుర్గాప్రసాద్ నిందితుడికి జీవితఖైదు విధిస్తూ మంగళవారం తీర్పు వెలువరించారు. ప్రభుత్వం తరఫున పోక్సో కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరసింహారెడ్డి వాదనలు వినిపించారు. ఈ కేసులో ఎస్ఐసీ నరేష్ ఎఫ్ఐఆర్ చేయగా, కేసు దర్యాప్తు నిర్వహించి నిందితుడిపై అప్పటి ఆర్మూర్ రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి ఛార్జిషీట్ దాఖలు చేశారు. కేసు విచారణలో సమన్వయం చేసిన ఆర్మూర్ రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జాన్ రెడ్డి, కోర్టు లైజన్ అధికారి టి. గోవింద్ బాల్కొండ పోలీస్ స్టేషన్ కోర్టు కానిస్టేబుల్ ఆర్. సాయికుమార్ కేసులో తమ విధులను సమర్ధవంతంగా నిర్వహించారు.
ఇది కూడా చదవండి: మందు చీర ఇస్తారు.. ఓట్లేసి గెలిపిస్తే..