Polytechnic Education | పాలిటెక్నిక్ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తే ఉద్యమిస్తాం..

పాలిటెక్నిక్ కళాశాలలను ‘శక్తి శాఖ’లో విలీనం చేయాలన్న ఆలోచనను తక్షణమే విరమించుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రఘురాం నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Polytechnic Education | పాలిటెక్నిక్ కళాశాలలను ‘శక్తి శాఖ’లో విలీనం చేయాలన్న ప్రభుత్వ ఆలోచనను తక్షణమే విరమించుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రఘురాం నాయక్ డిమాండ్ చేశారు. మంగళవారం పాలిటెక్నిక్​ కళాశాల (Polytechnic College) ఎదుట విద్యార్థులతో కలిసి ధర్నాకు దిగారు.

Polytechnic Education | జీవో నం.97ను రద్దు చేయాలి

రఘురాం నాయక్​ మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ విద్య అనేది పరిశ్రమలకు అవసరమైన సాంకేతిక నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించే ఒక ప్రత్యేక వ్యవస్థ అని అన్నారు. దీనిని శక్తి శాఖలో కలపటం వలన విద్యావ్యవస్థ తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.  ప్రభుత్వ కళాశాలలు ప్రైవేట్ పరం అయితే పేద మధ్యతరగతి విద్యార్థులకు తక్కువ ఖర్చుతో కూడిన డిప్లొమా విద్య అందకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు

పాలిటెక్నిక్ కళాశాలలను సాంకేతిక విద్యాశాఖ పరిధిలోనే కొనసాగించాలని రఘురాం డిమాండ్​ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్.97ను ఉపసవరించుకోవాలన్నారు. రాష్ట్రంలో సాంకేతిక విద్యా మండలిని విశ్వవిద్యాలయంగా అప్​డేట్​ చేస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించడంతో అందుకు మంత్రివర్గం ఉపసంఘం పచ్చజెండా ఊపిందన్నారు. తాజాగా ఐటీఐలు ఏటీసీలు పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో చేర్చాలని సర్కార్ నిర్ణయించిందన్నారు. ప్రభుత్వం సాంకేతిక విద్యాశాఖతో ఆటలాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన పాలసీ ద్వారా విద్యార్థులు కార్మికులుగా మారే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఈ ఆలోచనను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని లేకపోతే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కిషోర్, అజేష్, రామ్ చరణ్, నీరజ్, నాగేష్, శివ పవన్, కిషోర్, భాను, విష్ణు, మహేందర్ పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Sarvai Papanna Goud | బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *